రేవంత్ అంటే అల్లా టప్పా కాదు: కేటీఆర్‌కు చురకలు, ఒక్క సీటంటూ సవాల్
చేవెళ్ల: బీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో చేవెళ్లలో నిర్వహించిన 'జనజాతర' సభలో రేవంత్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సవాల్ విసిరారు. రేవంత్ పేరు చెబితే.. 3 సీట్లు కూడా వచ్చేవి కావని కేటీఆర్ చెప్పారన్నారు. ఇప్పుడు చేవెళ్ల సభ నుంచి కేటీఆర్‌కు సవాల్ విసురుతున్నట్లు తెలిపారు.
దమ్ముంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటయినా గెలిపించి చూపించాలంటూ కేటీఆర్‌కు రేవంత్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి అంటే అల్లాటప్పా అనుకోవద్దని హెచ్చరించారు. తాను తండ్రి పేరు చెప్పి పదవిలో కూర్చున్న వ్యక్తిని కాదని కేటీఆర్‌కు చురకలంటించారు. కార్యకర్త స్థాయి నుంచి సీఎం స్థాయికి ఎదిగానని రేవంత్ చెప్పుకొచ్చారు. చంచల్‌గూడ జైలులో పెట్టినా.. లొంగిపోకుండా పోరాడినట్లు చెప్పారు. నల్లమల అడవుల నుంచి దుర్మార్గులు, అవినీతిపరులను తొక్కుకుంటూ వచ్చానని రేవంత్ వ్యాఖ్యానించారు.

కార్యకర్తల అండ ఉన్నంత కాలం తన కుర్చీని ఎవరూ తాకలేరన్నారు రేవంత్. ప్రజలు బొంద పెట్టినా కేటీఆర్‌కు బుద్ధి రాలేదన్నారు. ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటే.. వాళ్లను ఊళ్లలోని చెట్లకు తలకిందులుగా వేలాడదీయాలన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్కసీటు కూడా రానివ్వకుండా పోరాడాలని కార్యకర్తలకు సూచించారు. బీఆర్ఎస్ నేతలు పొద్దున్న లేస్తే చాలు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ తన కుటుంబీకుల ఉద్యోగాల గురించి మాత్రమే ఆలోచించారని విమర్శించారు రేవంత్. కేసీఆర్ తన కుమార్తె, కుమారుడు, అల్లుడు, బంధువుల పదవుల గురించే ఆలోచించారు. మేం అధికారంలోకి వచ్చిన 2నెల్లలోపే 25 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాం. త్వరలోనే మెగా డీఎస్సీ వేసి భారీ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
తెలంగాణను దోచుకున్న కేసీఆర్ కుటుంబానికి ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారని రేవంత్ అన్నారు. ఎంపీలను గెలిపించటంతోనే నా బాధ్యత తీరిపోదు. పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి న్యాయం చేస్తాం. కార్యకర్తలను సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా గెలిపించినప్పుడే నా బాధ్యత నెరవేరుతుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
-
కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. రామయ్య ఆశీస్సులతో.. -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications