రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి : కాంగ్రెస్ కే డ్రగ్స్ ఘనకీర్తి ; కేటీఆర్ పై విమర్శలపై టీఆర్ఎస్ రచ్చ
తెలంగాణ రాష్ట్రంలో ఊహించని విధంగా టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు మంత్రి కేటీఆర్ కు తలనొప్పిగా మారాయి. తెలంగాణ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ ను డ్రగ్స్ కేసులో టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై టిఆర్ఎస్ పార్టీ మంత్రులు, నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి కేటీఆర్ పై విసిరిన వైట్ ఛాలెంజ్ ఇప్పుడు పొలిటికల్ హైడ్రామాకు కారణమైంది.

రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించిన టీఆర్ఎస్ ... ఘర్షణ, ఉద్రిక్తత
మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేస్తున్న రేవంత్ రెడ్డి ఇంటిని ఈరోజు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ముట్టడించారు. దీంతో అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారిని అడ్డగించారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల బాహాబాహి మధ్య రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తాము శాంతియుతంగా నిరసన తెలియజేయడానికివెళితే కాంగ్రెస్ పార్టీ వాళ్లు తమపై దాడి చేశారని టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తుంటే, రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గూండాల మాదిరిగా దాడికి పాల్పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ఇక రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

రేవంత్ వ్యాఖ్యలపై మండిపడుతున్న టీఆర్ఎస్ నేతలు
రేవంత్ రెడ్డి కేటీఆర్ మధ్య జరుగుతున్న డ్రగ్స్ వార్ ఇప్పుడు చిలికి చిలికి గాలివానగా మారింది. కాంగ్రెస్ వర్సెస్ టిఆర్ఎస్ గా ఈ వ్యవహారం మారడంతో రాజకీయంగా రచ్చ మొదలైంది. ఇక రేవంత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలపై కేటీఆర్ రేవంత్ రెడ్డి పై పరువు నష్టం దావా వేశారు. తెలంగాణ మంత్రులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రి కేటీఆర్ పై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులపై నిప్పులు చెరుగుతున్నారు. ఇక పియుసి చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు గుప్పించారు. కేడర్ లేని పార్టీకి లీడర్ రేవంత్ రెడ్డి అంటూ తీవ్రపదజాలంతో ద్వజమెత్తారు.
Recommended Video

కాంగ్రెస్ కే డ్రగ్స్ ఘన కీర్తి ఉందన్న జీవన్ రెడ్డి
కాంగ్రెస్ డ్రగ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ అంటూ సుబ్రహ్మణ్యస్వామి ఎప్పుడో చెప్పారని, గతంలో కాంగ్రెస్ డ్రగ్స్ వ్యవహారంపై ఘనకీర్తి వార్తలు ఎన్నో వచ్చాయని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కేటీఆర్ పై అనవసరపు విమర్శలు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. అభివృద్ధికి కేటీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అని పేర్కొన్న జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ కు బ్రాండ్ అంబాసిడర్ అని స్పష్టం చేశారు. మాకు తెలిసిన వైట్ అంటే తెల్ల కల్లు అని రేవంత్ రెడ్డికి తెలిసిన వైట్ అంటే డ్రగ్స్, గంజాయి అని ఆరోపించారు. పబ్బులు క్లబ్బులు తెలంగాణాలోనే ఉన్నాయా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లేవా అని ప్రశ్నించిన జీవన్ రెడ్డి, తెలంగాణ ప్రతిష్టను రేవంత్ రెడ్డి తీవ్రంగా దిగజారుస్తున్నారని విమర్శించారు. తప్పుడు ఆరోపణలు చేస్తే రేవంత్ రెడ్డి పై ప్రతీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని జీవన్ రెడ్డి హెచ్చరించారు.
-
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 15శాతం వేతనం వారి బ్యాంకు ఖాతాల్లో.. సభలో కీలక బిల్లు! -
ఆర్టీవో ఆఫీసులకు తిరిగే పని లేకుండా తెలంగాణా వాహనదారులకు సీఎం రేవంత్ శుభవార్త! -
YS Sharmila: జగన్ పై ముందుచూపు సరే..! చంద్రబాబుపై షర్మిల సెటైర్లు..! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications