బానిసత్వ సంకెళ్ళు బద్దలయ్యాయి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి ట్వీట్!!

తెలంగాణ ముఖ్యమంత్రిగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత, చాలా ఉద్వేగంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన తన ప్రసంగంలో ప్రగతి భవన్ దగ్గర ఇనుప కంచెలను బద్దలు కొట్టి ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చామని, ప్రగతి భవన్ వేదికగా ప్రజా దర్బార్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

ఇక ఇదే సమయంలో రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆయన తొలి పోస్ట్ చేశారు. ఈ పోస్టులో ఆయన తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొలుపు తీరిందని పేర్కొన్నారు. ఇంతకాలం ఉన్న బానిసత్వపు సంకెళ్లు బద్దలు అయ్యాయని తెలియజేశారు.

 Revanth Reddy interesting first tweet after sworn as Chief minister!!

ఇక తెలంగాణ రాష్ట్రం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుంది అని పేర్కొన్న రేవంత్ రెడ్డి సామాజిక న్యాయం, సమాన అభివృద్ధితో తెలంగాణ ఉజ్వలంగా వెలుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పేదల ముఖాలలో వెలుగులు వెల్లి విరుస్తాయని ఆయన పేర్కొన్నారు. హక్కుల రెక్కలు విచ్చుకుంటాయి అని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నా తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతాయి అంటూ ఇది మీ అన్న ఇస్తున్న మాట అంటూ తెలంగాణ ప్రజలకు మాటిచ్చారు.

ఇంతకాలం తెలంగాణ రాష్ట్రం దొరల పాలనలో బానిసత్వం తో ఉందని పేర్కొన్న రేవంత్ రెడ్డి, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి స్వేచ్ఛ వచ్చిందని, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళుతుందని తన పోస్టు ద్వారా అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలనే రేవంత్ రెడ్డి ఆశయం గొప్పగా ఉంది కానీ అది ఏ మేరకు ఆచరణలోకి వస్తుందనేది మాత్రం తెలియాల్సి ఉంది.

కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగి, కేసీఆర్ ను గద్దె దించాలని కసితో పని చేసిన రేవంత్ రెడ్డి ఎట్టకేలకు కేసీఆర్ ను గద్దె దించారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ఇందిరమ్మ రాజ్యం తెస్తానని చెప్తున్నారు రేవంత్ రెడ్డి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+