ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరు ఖరారు: 7న ప్రమాణ స్వీకారం

Revanth Reddy: తెలంగాణలో కొనసాగుతున్న హైడ్రామాకు తెర పడినట్టే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తెర దించింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేసింది. సీఎల్పీ సమావేశం ఆమోదించిన తీర్మానానికి అధికారికంగా ఆమోదముద్ర వేసింది.

దేశ రాజధానిలో ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన సమావేశం కొద్ది సేపటి కిందటే ముగిసింది. పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పరిశీలకుడు- కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఇన్‌ఛార్జ్ మాణిక్ రావు థాకరే, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇందులో పాల్గొన్నారు.

 Revanth Reddy is all set to be the CM of Telangana, take oath on December 7

ఈ భేటీ సందర్భంగా రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క లేవదీసిన అంశాల పట్ల వివరణ ఇచ్చింది. మల్లికార్జున ఖర్గే- వారితో వేర్వేరుగా మాట్లాడారు. ఈ సాయంత్రానికి రేవంత్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా- ఈ నెల 7వ తేదీన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కొత్తగా ఆవిర్భవించిన రాష్ట్రానికి ఆయన మూడో ముఖ్యమంత్రి అవుతారు. ఆయనతో పాటు కొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తొలిసారిగా ప్రభుత్వాన్ని నెలకొల్పనుంది.

మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జీవన్ రెడ్డి.. వంటి సీనియర్లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+