ప్రొ కోదండరామ్ కు రేవంత్ కీలక బాధ్యతలు - అందరి చూపు అటే..!!
తెలంగాణ ముఖ్యమంత్రిగా గా ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే మంత్రివర్గ కూర్పు పై ఢిల్లీ పర్యటనలో భాగంగా హైకమాండ్ అనుమతి తీసుకున్నారు. ఇదే సమయంలో ఎన్నికల్లో తమకు సహకరించిన పార్టీలకు..ముఖ్యులకు తగిన హోదా కల్పించేలా కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రొఫెసర్. కోదండరామ్ కు కీలక బాధ్యతలు అప్పగించేందుకు రేవంత్ నిర్ణయించారు.
కొత్త పాత్రలో కోదండరామ్
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పార్టీకి తెలంగాణ జన సమితి నేతగా ప్రొఫెసర్ కోదండరామ్ మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్ అధికారంలోకి రాటంతోనే కోదండరామ్ హర్షం వ్యక్తం చేసారు. ప్రొఫెసర్ గా సుదీర్ఘ అనుభవం ఉన్న కోదండరామ్ సేవలను వినియోగించుకోవాలని రేవంత్ భావిస్తున్నారు. అదే సమయంలో హోదాతో పాటుగా కీలక బాధ్యతలు అప్పగించేందుకు నిర్ణయించారు. 2009 లో తెలంగాణ ప్రకటన.. ఉద్యమ సమయంలో కోదండరామ్ ప్రధాన భూమిక పోషించారు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టి-జెఎసి) ఛైర్మన్‌గా వ్యవహరించారు. కోదండరామ్ నిర్ణయించిన ఉద్యమ కార్యాచరణలో కేసీఆర్ నాడు భాగస్వాములయ్యారు. ఉద్యమ సమయంలో సహాయ నిరాకరణ, మిలియన్ మార్చ్, వంటా వార్పు, సకల జనుల సమ్మె , సాగర హారం వంటి భారీ నిరసనలు నిర్వహించారు.

టీఎస్పీఎస్సీ ఛైర్మన్ గా
తెలంగాణ ఏర్పడిన తరువాత కేసీఆర్ నాడు చోటు చేసుకున్న పరిణామాలతో కోదండరామ్ ను దూరం పెట్టారు. దీంతో, 2018లో కోదండరామ్ తెలంగాణ జన సమితిని ఏర్పాటు చేసారు. నిరుద్యోగుల సమస్యలు పైన పలు సందర్భాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును తప్పు బట్టారు. నిరుద్యోగుల ఆందోళనకు మద్దతు ప్రకటించారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు సహకరించారు. దీంతో..విద్యావేత్తగా నిరుద్యోగ సమస్యల పైన పూర్తి అవగాహన ఉన్న కోదండరామ్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఛైర్మన్ గా నియమించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. కేసీఆర్ హయాంలో పరీక్షల నిర్వహణలో వైఫల్యం.. పరీక్షా పత్రాల లీకేజీలతో నిరుద్యోగులు ఆగ్రహానికి గురయ్యారు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచారు.
ఉద్యోగాల హామీ అమలు
అధికాంరలోకి వస్తూనే ఉద్యోగాల భర్తీకి సంబంధించి కాంగ్రెస్ ఎన్నికల ముందే షెడ్యూల్ ప్రకటించింది. దీంతో.. లక్షలాది మంది యువతకు ఉద్యోగాల కల్పన అంశం రేవంత్ తన ప్రాధాన్యత అంశంగా డిసైడ్ అయ్యారు. దీంతో ముందుగా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన..ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ నిర్వహణ బాధ్యతలను కోదండరామ్ కు అప్పగిస్తారని తెలుస్తోంది. దీని ద్వారా తెలంగాణ యువత ఆకాంక్షలు తెలిసిన వ్యక్తిగా టీఎస్పీఎస్సీ ఛైర్మన్ గా ఉంటే..ఎదురయ్యే ఇబ్బందులను సులువుగా పరిష్కరించవచ్చనేది మరో ఆలోచన. దీంత, కోదండరామ్ నియామకం పైన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత రేవంత్ రెడ్డి అధికారికంగా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications