ప్రమాణ స్వీకారం వేళ.. భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bhatti Vikramarka: తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ఇంకొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. రాత్రికి హైదరాబాద్‌కు తిరిగివచ్చారు. ఈ మధ్యాహ్నం 1:04 నిమిషాలకు లాల్ బహదూర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆయనతో పాటు కొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్లు తరలి రానున్నారు.

Revanth Reddy Oath taking: Bhatti Vikramarka made key remarks

ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క నియమితులు కానున్నారు. ఆయనతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం నేపథ్యంలో- హైదరాబాద్‌లో పండగ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం గాంధీభవన్‌ను అందంగా ముస్తాబు చేశారు. విద్యుద్దీపాలతో అలంకరించారు. రేవంత్ రెడ్డిని అభినందిస్తూ జంట నగరాల్లో పెద్ద ఎత్తున బ్యానర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి.

ప్రమాణ స్వీకారానికి బయలుదేరడానికి ముందు- భట్టి విక్రమార్క తన ఇంట్లో ప్రత్యేక పూజలు చేశారు. పూజగదిలో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిలువెత్తు చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం ఆయన తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు.

Revanth Reddy Oath taking: Bhatti Vikramarka made key remarks

రాష్ట్రంలో మరోసారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలనను తామందరం చూడబోతోన్నామని భట్టి విక్రమార్క అన్నారు. ప్రజల కోసం వైఎస్సార్ పడిన తపనను తాను దగ్గరి నుంచి చూశానని, తమందరికీ ఆయన ఆరాధ్యదైవమని, ఓ రోల్ మోడల్ అని వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌ను గురువుగా భావిస్తామని, ఆయన చూపిన బాటలో నడుస్తామని చెప్పారు.

ఇందిరమ్మ ఇళ్లు, ఫీజు రీఎంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ.. ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వైఎస్సార్ చిరస్మరణీయులు అయ్యారని భట్టి విక్రమార్క అన్నారు. సమాజం బాగుండాలి, ప్రజలు సంతోషంతో ఉండాలనే వైఎస్సార్ ఆశయాలే సాధనగా తమ ప్రభుత్వ పరిపాలన ఉంటుందని, తెలంగాణలో మళ్లీ ఇందిరమ్య రాజ్యం ఏర్పడుతుందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+