వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సవాల్ నేను చేయలేదు, వెనక్కి తగ్గిన కెటిఆర్‌నే అడగండి: జీహెచ్ఎంసీ ఫలితాలపై రేవంత్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాజయంపై తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేత రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం స్పందించారు. కేంద్రంలో గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తరపున ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రచారం చేసినా సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైందని, భారీ అంచనాలు లేకుండానే బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని అన్నారు.

ఇదే విధంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయం సాధించిందని అన్నారు. ఈరోజు తిరస్కరించిన పార్టీలకు భవిష్యత్‌లో మళ్లీ ప్రజామోదం ఉంటుందని చెప్పారు. టిఆర్ఎస్ గెలుపును జీహెచ్ఎంసీ పరిధి వరకే చూడాలని అన్నారు.

Revanth Reddy on GHMC polling

టిడిపి, బిజెపిలు గెలుపు కోసమే ప్రయత్నించాయని, ఇండింపెండెంట్ అభ్యర్థులు కూడా గెలవాలనే కోరుకుంటారని తెలిపారు. పోలింగ్ పెరిగితే మేయర్ గెలుస్తామని తాము ఎప్పుడూ అనుకోలేదని చెప్పారు. టిఆర్ఎస్ పార్టీకి మేయర్ పదవి కట్టబెట్టాలని ప్రజలు ఆశించారు.. అందుకే టిఆర్ఎస్ పార్టీని గెలిపించారని రేవంత్ రెడ్డి తెలిపారు.

రాష్ట్ర మంత్రి కెటి రామారావు ఎన్నికల ముందు సవాల్ విసిరారని, తాను ఎలాంటి సవాల్ చేయలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరైనా తన సవాల్‌కు స్పందించాలని కెటిఆర్ అన్నారని తెలిపారు.

తాను ఎన్నికలపై సవాల్ విసరలేదని, కెటిఆర్ విసిరిన సవాల్‌కు మాత్రమే స్పందించానని రేవంత్ రెడ్డి తెలిపారు. 100 సీట్లు గెలుస్తుందని తాను అనలేదని, మేయర్ పీఠం గెలుచుకుంటామని మాత్రమే తాను సవాల్ విసిరానని కెటిఆర్ వెనక్కి తగ్గారన్నారు. సవాల్‌పై అడగాలనుకుంటే వెనక్కి తగ్గిన కెటిఆర్‌నే అడగాలని రేవంత్ రెడ్డి మీడియాకు సూచించారు.

గ్రేటర్‌ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని సూచించారు. ఊహించని విధంగా ఫలితాలు వెలవడటంపై కారణాలను సమీక్షిస్తామని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు.

కాగా, గ్రేటర్‌ ఎన్నికల్లో ప్రజల తీర్పు శిరసావహిస్తామని తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్‌ రమణ అన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యలపై పోరు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గ్రేటర్‌ ఎన్నికల్లో ఫలితాలు విశ్లేషించుకుని ఓటమికి గల కారణాలపై మదింపు
చేసుకుంటామన్నారు.

English summary
Telugudesam MLA Revanth Reddy on Friday responded on GHMC polling and Telangana Minister KT Rama Rao's Challenge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X