హరీష్ మామ చెప్పిన సీసపద్యమంతా లేఖలో రాసుకొచ్చాడు.. రేవంత్ రెడ్డి సెటైర్లు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావుల మధ్య సవాళ్ళ పర్వం కొనసాగుతూనే ఉంది. ఈరోజు ఉదయం అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చిన హరీష్ రావు తాను రాజీనామా లేఖతో వచ్చానని, సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే తన సవాల్ ను స్వీకరించాలని, రావడానికి మొహమాటంగా ఉంటే తన పీఏ తో అయినా తన స్టాఫ్ తో అయినా రాజీనామా లేఖను పంపించాలని డిమాండ్ చేశారు.
హరీష్ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం
ఇక దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి మోసం చేయాలనుకునే ప్రతిసారి హరీష్ రావుకు అమరవీరుల స్థూపం గుర్తొస్తుంది అని కౌంటర్ వేశారు. హరీష్ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం అని, ఇన్నాళ్లు అమరవీరుల స్థూపం దగ్గరికి వెళ్లని హరీష్ రావు ఇప్పుడు రాజీనామా చేస్తానని లెటర్ రాసుకొని అమరవీరుల స్థూపం దగ్గరకు ఎందుకు వెళ్ళాడు అంటూ ప్రశ్నించారు.

రాజీనామా లేఖ స్పీకర్ ఫార్మాట్ లో ఉండాలి
స్పీకర్ ఫార్మాట్లో లేకుంటే రాజీనామా లేఖ చెల్లదని, హరీష్ రావు రాసింది రాజీనామా లేఖ కాదని , హరీష్ రావు తన మామ కేసీఆర్ చెప్పిన సీస పద్యాన్ని లేఖలో రాసుకు వచ్చారంటూ ఎద్దేవా చేశారు. హరీష్ రావు అతితెలివి ప్రదర్శిస్తున్నాడని మండిపడిన రేవంత్ రెడ్డి ఆయన తెలివి మోకాళ్లలో నుంచి అరికాళ్ళలో కి జారినట్టు ఉంది అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే అదే చెప్తున్నా హరీష్
ఇక ఇదే సమయంలో "హరీష్.. ఇప్పటికీ చెబుతున్నా ఆగస్టు 15లోగా రెండు లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతామని నీ రాజీనామా రెడీగా పెట్టుకో" అంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఇక హరీష్ రావు తాజాగా అమరవీరుల స్తూపం వద్దకు వచ్చి రాజీనామా లేఖ తెచ్చానని చెప్పిన ఘటనపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం మండిపడ్డారు.
రాజీనామా లేఖ పేరుతో హరీష్ రావు జోకర్ అయ్యారు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
రాజీనామా లేఖ పేరుతో హరీష్ రావు డ్రామాలు చేస్తున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. రాజీనామా పేరుతో హరీష్ రావు మళ్ళీ జోకర్ అయ్యాడని, హరీష్ రావు దొంగ రాజీనామా, మీరు చేసేవి దొంగ దీక్షలు అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు ఇప్పుడు మీరు డ్రామాలు ఆడితే ప్రజలు ఎవరూ పట్టించుకోరని, దమ్ముంటే మెదక్లో డిపాజిట్ తెచ్చుకో చాలు అంటూ సవాల్ విసిరారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications