ఇదీ రేవంత్!: ఏబీవీపీ నేత కాంగ్రెస్‌లోకి, బీజేపీకి దిమ్మతిరిగే సంకేతాలు, టీఆర్ఎస్ నుంచీ

Posted By:
Subscribe to Oneindia Telugu
ఆత్మీయుల మాట..ముచ్చట.. : కెసిఆర్ ని బండ బూతులు తిట్టిన రేవంత్‌రెడ్డి | Oneindia Telugu

హైదరాబాద్: రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. తద్వారా తెలంగాణలో మరింత రాజకీయ వేడి రాజుకోనుంది.

చదవండి: రేవంత్ ఓట్లు కురిపించే బాహుబలి, నమ్మకం వచ్చింది: రామ్ గోపాల్ వర్మ

ఒక్క రేవంత్ రెడ్డి తెలంగాణలోని ఎన్నో నియోజకవర్గాల్లో సమీకరణాలు మార్చనున్నారని భావిస్తున్నారు. సోమవారం జూబ్లీహిల్స్‌లో జరిగిన ఆత్మీయ భేటీకి పెద్ద ఎత్తున అభిమానులు, నేతలు తరలి వచ్చారు.

చదవండి: రేవంత్‌కు షాక్: ఆ కీలక నేతలు యూటర్న్, రాహుల్‌కు లిస్ట్ ఇవ్వాలని కాంగ్రెస్

అవకాశమిస్తే కేసీఆర్‌కు ధీటుగా

అవకాశమిస్తే కేసీఆర్‌కు ధీటుగా

119 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. దీంతోనే రేవంత్ రెడ్డి ప్రాధాన్యత తెలిసిపోతుందని చెబుతున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆ పార్టీకి మరింత లాభమని, ఆయనకు మంచి ప్రాధాన్యత కల్పిస్తే కేసీఆర్‌ను ఢీకొట్టడం సులభమని కాంగ్రెస్ నేతలే భావిస్తుండటం గమనార్హం. ఆదివారం షబ్బీర్ అలీ మాట్లాడుతూ... కేసీఆర్‌ను ధీటుగా ఎదుర్కోగల నేత రేవంత్ అని కితాబిచ్చారు.

కొందరు నేతల వేచిచూసే ధోరణి

కొందరు నేతల వేచిచూసే ధోరణి

ఇప్పటికే రేవంత్ రెడ్డి నడిచేందుకు తెలంగాణ టీడీపీ నేతలు చాలామంది సిద్ధమయ్యారు. ఆయన చేరిన తర్వాత ఆయనకు కాంగ్రెస్ ఇచ్చే ప్రాధాన్యతను బట్టి, కేసీఆర్‌ను రేవంత్ ఎదుర్కొనే తీరును బట్టి మరికొందరు టీడీపీ నేతలు, ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కొట్టిపారేయలేమని అంటున్నారు. అంటే కొందరు వేచి చూసే ధోరణి అవలంభిస్తున్నారని తెలుస్తోంది.

టీఆర్ఎస్ నుంచి కూడా వలసలు

టీఆర్ఎస్ నుంచి కూడా వలసలు

కేసీఆర్‌ను రేవంత్ ఎదుర్కొనే తీరును, ఆయన ప్రభుత్వాన్ని ఎండగట్టే వైఖరి ఇప్పటికే చాలామందికి నచ్చుకుంది. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత రేవంత్‌ను చూశాక.. కేవలం టీడీపీ నుంచే కాదని, అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కాంగ్రెస్‌లోకి వలసలు ఉంటాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

ఏబీవీపీ రేవంత్ కాంగ్రెస్‌లోకి, బీజేపీకి గట్టి దెబ్బ

ఏబీవీపీ రేవంత్ కాంగ్రెస్‌లోకి, బీజేపీకి గట్టి దెబ్బ

రేవంత్ రెడ్డి విద్యార్థి నేతగా బీజేపీ నాయకుడు. అలాంటి రేవంత్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారు. టీడీపీ లేదని భావిస్తున్న రేవంత్.. కేసీఆర్ పైన పోరాటానికి ఒకప్పటి ఏబీవీపీ నాయకుడిగా బీజేపీలోకి వెళ్లాలని, కానీ కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారని గుర్తు చేస్తున్నారు. అది బీజేపీకి గట్టి దెబ్బ అంటున్నారు.

బీజేపీ చేతికి రాని రేవంత్ రెడ్డి

బీజేపీ చేతికి రాని రేవంత్ రెడ్డి

రేవంత్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆయన చేరికను ఇప్పుడు బీజేపీ నేతలు తేలిగ్గా కొట్టి పారేస్తున్నారు. కానీ అదే రేవంత్ కోసం బీజేపీ నేతలు కూడా గట్టి ప్రయత్నాలు చేసినట్లుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు చేజారారు కాబట్టి తేలిగ్గా కొట్టి పారేవేస్తున్నారని అంటున్నారు.

రేవంత్ సత్తా ఏమిటో తెలిసిపోతోంది

రేవంత్ సత్తా ఏమిటో తెలిసిపోతోంది

స్వయంగా టీడీపీ నాయకులే.. రేవంత్ రెడ్డి పార్టీని వీడటం కోలుకోలేని దెబ్బ అని చెబుతున్నారు. అది నిజమే అన్నట్లు చాలామంది కీలక నేతలు ఆయన వెంట నడుస్తున్నారు. రేవంత్‌ను కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆకాశానికెత్తుతున్నారు. ఆయన చేరికతో తమ బలం ఎంతో పెరుగుతుందని చాలామంది అంటున్నారు. ఇంకొందరు ఆయన చేరికతో తమ ప్రాబల్యం పడిపోతుందని భావిస్తున్నారు. అంటే రేవంత్ హవాను అందరూ ప్రత్యక్షంగా, పరోక్షంగా అంగీకరిస్తున్నారు.

బీజేపీ కంటే కాంగ్రెస్ బలంగా ఉందని రేవంత్ సంకేతాలు

బీజేపీ కంటే కాంగ్రెస్ బలంగా ఉందని రేవంత్ సంకేతాలు

ఇలా ఏ రకంగా చూసినా రేవంత్ రెడ్డి ప్రాధాన్యతను కొట్టిపారేయలేని విధంగా ఉంది. చాన్నాళ్లుగా టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ చెబుతోంది. కానీ తన చేరిక ద్వారా బీజేపీ కంటే కాంగ్రెస్ మాత్రమే కేసీఆర్‌ను ఎదుర్కోగలదని రేవంత్ చెప్పినట్లుగా భావించవచ్చునని అంటున్నారు. బీజేపీకి తెలంగాణలో స్థానిక బలం లేదని మరోసారి రుజువైందని అంటున్నారు.

టార్గెట్ కోసం బలమైన పార్టీని ఎంచుకున్నారా?

టార్గెట్ కోసం బలమైన పార్టీని ఎంచుకున్నారా?

ఎందుకంటే రేవంత్ తన టార్గెట్ ఏమిటో సూటిగా చెప్పారు. కేసీఆర్‌ను గద్దె దించడమే తన లక్ష్యమని చెప్పారు. ఆ లక్ష్యం కోసం తెలంగాణలో టీఆర్ఎస్ తర్వాత బలంగా ఉన్న పార్టీని ఆయన ఎంచుకున్నారని, అదే కాంగ్రెస్ అని అర్థమవుతోందని అంటున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Political observers say it is a snub for the BJP that Revanth, who has a background with the ABVP did not consider joining the party.
Please Wait while comments are loading...