వాళ్ళంతా కెసిఆర్ మనుషులే: టిడిపి నేతలపై రేవంత్‌ సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: గోల్కొండ హోటల్‌లో నిర్వహించిన టిడిపి, బిజెపి ఎమ్మెల్యేల సమావేశానికి టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి గైరాజరయ్యారు. ఈ సమావేశం కెసిఆర్ పెట్టించాడేమోనని ఆయన విమర్శలు గుప్పించారు.కెసిఆర్‌తో సాయంత్రం పూట సమావేశమయ్యే నేతలకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు రేవంత్ రెడ్డి.

ట్విస్ట్:టిడిఎల్పీ నుండి కంప్యూటర్, ఫైళ్ళను తీసుకెళ్ళిన రేవంత్

టిడిపిలో రేవంత్‌రెడ్డి ఎపిసోడ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ వెళ్లారనే ప్రచారం ఊపందుకొన్న నేపథ్యంలో రేవంత్‌ను పార్టీ పదవులను నుండి తగ్గించేశారు. ఎమ్మెల్యేగానే కొనసాగాలంటూ రేవంత్‌కు పార్టీ చీఫ్ ఎల్. రమణ ఆదేశాలు జారీ చేశారు.

చిచ్చుపై బాబు ఆరా: కత్తులు దూసుకొంటున్న రమణ, రేవంత్‌రెడ్డి

టిడిఎల్పీ సమావేశాన్ని రేవంత్‌రెడ్డి అర్ధాంతరంగా రద్దు చేసుకొన్నారు.. టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వినతి మేరకు రేవంత్‌రెడ్డి టిడిఎల్పీ సమావేశాన్ని రద్దు చేసుకొన్నారు.బిఎసి సమావేశానికి రేవంత్‌కు బదులుగా సండ్ర వెంకటవీరయ్య హజరయ్యారు.

టిడిపి, బిజెపి ఎమ్మెల్యే సమావేశానికి రేవంత్ డుమ్మా

టిడిపి, బిజెపి ఎమ్మెల్యే సమావేశానికి రేవంత్ డుమ్మా


గోల్కొండ హోటల్‌లో టిడిపి, బిజెపి ఎమ్మెల్యేల సమావేశానికి టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి డుమ్మా కొట్టారు. ఈ సమావేశాన్ని కెసిఆర్ ఏర్పాటు చేయించారా అంటూ రేవంత్‌రెడ్డి టిడిపి నేతలపై పరోక్ష విమర్శలు గుప్పించారు. కెసిఆర్ పెట్టే భోజననానికి తాను హజరుకాబోనని ఆయన ప్రకటించారు.ప్రజాసమస్యలపై చర్చించేందుకు స్టార్‌హోటల్లో సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఉందా అని ఆయన ప్రశ్నించారు.

రేవంత్‌కు ఝలక్: ఎమ్మెల్యేగానే ఉండాలంటూ ఎస్ఎంఎస్ పంపిన రమణ

నన్ను తిట్టేవాళ్ళంతా కెసిఆర్ అనుకూలురే

నన్ను తిట్టేవాళ్ళంతా కెసిఆర్ అనుకూలురే

తనను తిట్టేవాళ్ళంతా కెసిఆర్‌ అనుకూలవాదులేనని టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కెసిఆర్‌కు వ్యతిరేకంగా తాను పోరాటం చేస్తున్న విషయాన్ని మరోసారి గుర్తుచేశారు. అయితే కొందరు పార్టీ నేతలు టిఆర్ఎస్‌తో కుమ్మక్కు అయ్యారని ఆయన పరోక్షంగా టిడిపి సీనియర్లపై విమర్శలు గుప్పించారు.

ఉదయం టిడిపిలో సాయంత్రం కెసిఆర్‌తో

ఉదయం టిడిపిలో సాయంత్రం కెసిఆర్‌తో

ఉదయం పూట టిడిపి కార్యాలయం ఉండే కొందరు నేతలు సాయంత్ర కాగానే కెసిఆర్ ములాఖత్‌ అవుతున్నారని రేవంత్ అభిప్రాయపడ్డారు. అందుకే కొందరు నేతలు తనతో విభేధిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ప్రతి రోజూ కెసిఆర్‌తో ములాఖత్ అయ్యే నేతలకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

చంద్రబాబు లేకుండా పదవుల నుండి తొలగిస్తారా?

చంద్రబాబు లేకుండా పదవుల నుండి తొలగిస్తారా?

చంద్రబాబునాయుడు విదేశాల్లో ఉన్న సమయంలో తనను పదవుల నుండి తొలగించడంపై రేవంత్‌రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు వద్దే తాను తేల్చుకొంటానని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. పార్టీ కోసం తాను పడిన కష్టాన్ని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు.

ఎర్రబెల్లి వ్యాఖ్యలపై రమణ ఎందుకు వివరణ ఇవ్వలేదు

ఎర్రబెల్లి వ్యాఖ్యలపై రమణ ఎందుకు వివరణ ఇవ్వలేదు

టిడిపి తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణతో పాటు పార్టీలో చాలా మంది నేతలు తమవైపే ఉన్నారని ఎర్రబెల్లి దయాకర్‌రావు చేసిన వ్యాఖ్యలపై పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. పదవుల నుండి తప్పించాల్సిన అవసరం కెసిఆర్‌కు తప్ప మరొకరికి లేదని రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.తెలంగాణలో టిడిపియే లేదని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ప్రకటించారని, అయితే ఆకస్మాత్తుగా ఆ పార్టీ నేతతో ఎందుకు సమావేశం నిర్వహించాల్సి వచ్చిందో చెప్పాలని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tdp MLA Revanth Reddy boycotted BJP, TDP MLA's coordination meeting held at Golconda hotel in Hyderabad.Revanth made allegations on Tdp leaders on Thurday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి