జగన్..రాష్ట్రం కోసం నాడు త్యాగాలు, నేడు - తెలంగాణలో "కొత్త" చరిత్ర...!!
తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసారు. తరలి వచ్చిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం..అభిమానులు..పార్టీ నేతల సమక్షంలో రేవంత్ తెలంగాణలో తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసారు. తెలంగాణ ఏర్పాటు నుంచి ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటు పైన కాంగ్రెస్ నాయకత్వం ఆశలు పెట్టుకుంది. పదేళ్ల నిరీక్షణ తరువాత ఇప్పుడు ఆ కల ఫలించింద రేవంత్ కేబినెట్ లో మంత్రులు అయిన వారికి రాజకీయ జీవితంలో ఎన్నో కీలక ఘట్టాలు ఉన్నాయి.
సీనియార్టీకి పట్టం : అనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. సోనియా గాంధీతో కలిసి ఓపెన్ టాప్ జీప్ లో రేవంత్ ప్రమణ స్వీకార వేదిక వద్దకు వచ్చారు. ముందుగా ముఖ్యమంత్రి ఆ తరువాత భట్టి..వరుసగా మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. రేవంత్ తో సహా మరో ముగ్గురు తొలి సారి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. రేవంత్ నేరుగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా.. సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తొలి సారి మంత్రులయ్యారు. సీతక్క, పొంగులేటి ప్రమాణ స్వీకారం సమయంలో కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున హర్ష ధ్వానాలు వినిపించాయి. ఇక, సీతక్క.. సురేఖను సోనియా గాంధీ ప్రత్యేకంగా అభినందించారు.

నాడు త్యాగాలు..నేడు పదవులు : ఇదే సమయంలో గతంలో తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేసిన కోమటిరెడ్డి, జూపల్లి తిరిగి మంత్రులుగా అవకాశం దక్కింది. నాడు జగన్ కు మద్దతుగా మంత్రి పదవిగా రాజీనామా చేసిన కొండా సురేఖ దాదాపు 12 ఏళ్ల తరువాత మంత్రి పదవి చేపట్టారు. రేవంత్ తన కేబినెట్ లో సీనియార్టీకి ప్రాధాన్యత ఇచ్చారు. భారీ అంచనాలతో కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ కు సీఎం పగ్గాలు అప్పగించింది. అయితే, ఈ సీనియర్లు ఏ స్థాయిలో రేవంత్ కు సహకరిస్తారనేది ఇప్పుడు కీలకంగా మారనుంది. కాంగ్రెస్ హామీ ఇచ్చిన గ్యారంటీల అమలే అసలు సవాల్. అదే సమయంలో మరో ఆరు మంత్రి పదవులు భర్తీ చేయాల్సి ఉంది. ఆశావాహుల సంఖ్య భారీగా కనిపిస్తోంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామని ముఖ్యమంత్రిగా రేవంత్ తన తొలి ప్రసంగంలో హామీ ఇచ్చారు.

రేవంత్ సమర్ధతకు పరీక్ష : అటు ప్రతిపక్షాలు కొంత కాలం మౌనంగానే ఉండే అవకాశం ఉంది. వారికి అవకాశం ఇవ్వకుండా రేవంత్ అటు పార్టీ..ఇటు ప్రభుత్వాన్ని ఎలా ముందుకు నడిపిస్తారనేది అతి పెద్ద సవాల్. లోక్ సభ ఎన్నికల వరకు రేవంత్ ను పీసీసీ చీఫ్ గా కొనసాగిస్తారనే ప్రచారమూ పార్టీలో వినిపిస్తోంది. ఇక, హైదరాబాద్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన అనేక రకాల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ తెలంగాణ వ్యాప్తంగా గెలిచినా.. హైదరాబాద్ లో మాత్రం ఒక్క సీటు సాధించలేదు. దీంతో..ఇక కొత్త ప్రభుత్వ సారధిగా తన సమర్ధతను ఎలా చాటుకుంటారనేది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications