శ్రీలీలను లాగిన రేవంత్ రెడ్డి.. కేటీఆర్‌ను కార్నర్ చేస్తూ కౌంటర్

తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నాయి. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనతో కేవలం రెండున్నర ఏళ్ల కాంగ్రెస్ పాలనను పోల్చడంపై మాజీ మంత్రి కేటీఆర్‌కు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు సీఎం.

మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి ..కేటీఆర్ విమర్శలను బాలీవుడ్ నటి శ్రీలీల ఐటమ్ సాంగ్‌తో పోల్చారు.శ్రీలీల ఐటమ్ సాంగ్‌కి, కేటీఆర్ ప్రచారానికి తేడా లేదు. కేవలం ఆకర్షణ మాత్రమే ఉంది, సారం లేదు.

Revanth Reddy s Counter to KTR Jubilee Hills Campaign Heats Up

అంతేకాక, మహిళా భద్రత గురించి మాట్లాడుతూ..సొంత చెల్లిని, మాగంటి తల్లిని అవమానించిన కేటీఆర్ మహిళలకు ఎలా రక్షణ కల్పిస్తాడు? అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

మునుపటి బీఆర్‌ఎస్ పాలనపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని మాకు అప్పగించింది. వారి అప్పులు తీరుస్తూనే మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీయించారు.

కేసీఆర్ నిర్మించిన కమాండ్ కంట్రోల్ రూమ్, సచివాలయం, ప్రగతి భవన్‌ల వల్ల రాష్ట్రంలో ఒక్క ఉద్యోగం అయినా వచ్చిందా అని సీఎం ప్రశ్నించారు. మేము చేసిన అభివృద్ధి పనులు కేసీఆర్ చెరిపేస్తే పోయేవి కావు అని గట్టిగా చెప్పారు.కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం అయింది. ప్రజల డబ్బులన్నీ ఎక్కడికి పోయాయి? అంటూ ప్రశ్నించి, బీఆర్‌ఎస్ అవినీతిని ఎండగట్టారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వెనుక కాంగ్రెస్ చేసిన త్యాగాన్ని ప్రజలు గుర్తించాలని సీఎం కోరారు. తమ మాట ప్రకారం తెలంగాణ ఏర్పడిందని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ప్రాంతానికి అవకాశం ఇస్తే, గత పదేళ్లలో జరగని అభివృద్ధిని వందల కోట్లతో చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, 2004-2014 మధ్య కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ప్రజలను కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+