వైరల్ వీడియో: ఛీ.. ఛీ.. వీడ్ని ఏం చేసినా తప్పులేదు..
సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్ పేటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో దారుణమైన ఘటన జరిగింది. ఫుల్ గా మద్యం సేవించిన వాచ్ మెన్.. విద్యార్థుల కోసం తయారు చేసిన అన్నం గిన్నెలో కాలు పెట్టి నిద్రపోయాడు. ఈ ఘటనను చూసి విద్యార్థులు, అధ్యాపకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు పెద్దలు.. అతడు తప్పతాగి అన్నం గిన్నెలోనే కాలు పెట్టి నిద్రపోవడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మద్యం మత్తులో ఒళ్లు సోయి మరిచిన ఓ వాచ్ మెన్.. ఏకంగా అన్నంలో కాలు పెట్టి నిద్రపోయిన ఘటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో సరైన వసతులపై ప్రశ్నలు లేవనెత్తున్నారు నెటిజన్లు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్ పేటలోని పాలిటెక్నిక్ కాలేజీలో జరిగింది. పట్టపగలే తప్పతాగిన ఓ వాచ్ మెన్ కిచెన్ లోకి ప్రవేశించాడు. అదే సమయంలో విద్యార్థులకు వర్కర్లు.. మధ్యాహ్న భోజనం రెడీ చేశారు. అయితే మద్యం మత్తులో ఆ వ్యక్తి విద్యార్థుల కోసం తయారు చేసిన అన్నం గిన్నెలో కాలు పెట్టి నిద్రపోయాడు. ఇంతలో ఎవరో వచ్చి పిలవగా లేచాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
A drunk watchman deployed at a hostel in Telangana’s Sangareddy was on Wednesday, November 12 seen sleeping with his foot in rice prepared for students.
— The Siasat Daily (@TheSiasatDaily) November 14, 2025
The incident occurred at a polytechnic college in the Ismailkhanpet area. The students, who arrived at the mess for lunch,… pic.twitter.com/dEQZhPUEuN
ఈ ఘటనను చూసిన కాలేజీలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు షాక్ అయ్యారు. అతడి ప్రవర్తనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నిందితుడు శేఖర్ గా గుర్తించిన అధికారులు.. వెంటనే అతడ్ని విధుల నుంచి తొలగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
-
పాప టాలెంట్ చూపిస్తోందిగా..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications