మార్పు: స్వచ్ఛ హైదరాబాద్‌లో రౌడీ షీటర్లు

హైదరాబాద్: హైదరాబాదు నగరంలోని సంతోష్‌నగర్ పరిధిలో ఉన్న 18 పోలీస్‌స్టేషన్లలో పోలీసులు మంగళవారంనాడు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బందితో పాటు దాదాపు 300 మంది రౌడీషీటర్లు పాల్గొన్నారు. స్టేషన్ పరిసరాలను శుభ్రపరిచారు.

స్వచ్ఛ హైదరాబాదులో పాల్గొనడానికి రౌడీ షీటర్లు ఆసక్తి చూపించారని, స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని పోలీసు అధికారులు అంటున్నారు. ప్రజలతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపించారని, వారిలో మార్పు వస్తోందని వారు చెప్పారు.

hyderabad

మారడానికి తమకు అవకాశం ఇవ్వాలని రౌడీ షీటర్లు అడిగారని వారు చెప్పారు. హైదరాబాదులో 70 మందిదాకా రౌడీ షీటర్లు ఉన్నట్లు అంచనా. వారిలో దాదాపు 80 మందిపై రౌడీ షీట్లు ఎత్తేసినట్లు తెలుస్తోంది. సత్ప్పవర్తనకు గాను వారిపై రౌడీషీట్లు ఎత్తేశారు. వారంతా హైదరాబాదులోని వివిధ ప్రాంతాలను గడగడలాడించినవారే. ఇప్పుడు చేతులతో చీపుర్లు, పారలు పట్టి చెత్తను ఎత్తేసే పనిలో పడ్డారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్వచ్ఛ హైదరాబాదు కార్యక్రమాన్ని పెద్ద యెత్తున చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు రాజకీయ నాయకులు కూడా పాల్గొంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+