తిరుమలకు కేసీఆర్ రూ.5 కోట్ల కానుకలు: విమర్శలపై పరిపూర్ణ జవాబు

హిందూ మతం పైన నమ్మకం లేని రాఘవులుకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మొక్కుల గురించి మాట్లాడే అర్హత లేదని కాకినాడ శ్రీపీఠం స్వామిజీ పరిపూర్ణానంద సరస్వతి అన్నారు.

హైదరాబాద్: హిందూ మతం పైన నమ్మకం లేని రాఘవులుకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మొక్కుల గురించి మాట్లాడే అర్హత లేదని కాకినాడ శ్రీ పీఠం స్వామిజీ పరిపూర్ణానంద సరస్వతి అన్నారు.

హిందువులు మాత్రమే దేవాదాయ శాఖ పేరుతో ప్రభుత్వాలకు పట్టం కడుతున్నారని చెప్పారు. మరే మతస్తులు ప్రభుత్వానికి రూపాయి చెల్లించరని తెలిపారు. జెరూసలేం, మక్కా యాత్రలకు ఇస్తోంది ప్రజల సొమ్ము కాదా అని నిలదీశారు.

హిందువుల మొక్కు తీర్చిన సొమ్మే ప్రజల సొమ్ము అవుతుందా అని అడిగారు. సిపిఎం నేత రాఘవులుకు దమ్ము ఉంటే ఇతర మతార వ్యవహారాల పైన కూడా మాట్లాడాలని సవాల్ చేశారు. రూ.5 కోట్ల విలువైన ఆభరణాలను కేసీఆర్ తిరుమల శ్రీవారికి మొక్కుగా చెల్లించిన విషయం తెలిసిందే.

కేసీఆర్ మొక్కులపై విమర్శలు

కేసీఆర్ మొక్కులపై విమర్శలు

తెలంగాణ వస్తే శ్రీవారికి కానుకలు చెల్లిస్తానని కేసీఆర్ ఉద్యమం సమయంలో మొక్కుకున్నారు. బుధవారం నాడు ఆయన మొక్కు చెల్లించుకున్నారు. అయితే దీని పైన పలు పార్టీలు విమర్శలు గుప్పించాయి.

మర్రి ప్రశ్నలు

మర్రి ప్రశ్నలు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల సొమ్మును కేసీఆర్ తన మొక్కుగా ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ సమర్పించిన ఆభరణాల పైన లెక్కలు కావాలని తాను టిటిడికి లేఖ రాస్తానని చెప్పారు.

ఇతరులు కూడా..

ఇతరులు కూడా..

మర్రి శశిధర్ రెడ్డియే కాదు.. సీపీఎం నేత రాఘవులు, మరికొందరు కూడా ప్రజల సొమ్మును దేవుడికి తన మొక్కుగా ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు.

కౌంటర్

కౌంటర్

విమర్శల పైన దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందించారు. కేబినెట్ ఆమోదం తర్వాతనే ఇది జరిగిందని చెప్పారు. ఇప్పుడు పరిపూర్ణానంద కూడా ఘాటైన కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వాలకు దేవాదాయ శాఖ మాత్రమే డబ్బులు చెల్లిస్తుందని, ఇతర మతాలు చెల్లించడం లేదని, కప్పం కడుతున్న ఆలయాలకు మొక్కు చెల్లిస్తే తప్పేమిటని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+