తెలంగాణా ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఫ్రీ బస్సే కాదు, బస్సెక్కగానే అలా
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ప్రయాణికులకు తన సేవలతో దూకుడుని చూపిస్తోంది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించడానికి అనేక విధానాలు అమలవుతుండగా, తాజాగా ప్రయాణికులను ఆకట్టుకునేందుకు, ఆర్టీసీకి ప్రయాణికుల పట్ల ఉన్న సానుకూల దృక్పథాన్ని, ఆప్యాయతను తేటతెల్లం చేసేందుకు మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రయాణికుల పలకరింపు కార్యక్రమంతో ఆర్టీసీ ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు ప్రయత్నం చేస్తుంది.
ఆర్టీసీ బస్సులలో ప్రయాణికుల పలకరింపు
tgsrtc నూతన ఎండి వై నాగిరెడ్డి ఆదేశాలతో ప్రయాణికుల పలకరింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. బండ్లగూడ డిపోలో ఈ మేరకు ప్రతి బస్సులోనూ ప్రయాణికుల పలకరింపు కొనసాగుతుంది. ఇక ఈ విధానం నిదానంగా అన్ని డిపోలకు విస్తరిస్తోంది. ట్రిప్ ప్రారంభంలో కండక్టర్ ప్రయాణికులు అందరినీ పలకరించి, తన పేరు, డ్రైవర్ పేరు చెప్పి, ఆ బస్సు ఏ రూట్లో వెళుతుంది, ప్రయాణానికి ఎంత సమయం పడుతుంది అనే వివరాలు చెప్తారు.

ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణం చెయ్యాలని విజ్ఞప్తి
ప్రైవేట్ బస్సులలో, ఆటోలలో ప్రయాణించవద్దని, ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణం చేయాలని విజ్ఞప్తి చేస్తారు. మెరుగైన ప్రయాణ అనుభవం కోసం ఆర్టీసీ బస్సులలోనే వెళ్లాలని ప్రతి ఒక్కరికి చెబుతారు. ఆర్టీసీ బస్సులను ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతారు. ప్రస్తుతం అన్ని బస్సుల్లోనూ కండక్టర్ బస్సు ప్రారంభంలో ప్రయాణికుల పలకరింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఆర్టీసీ నిర్ణయం పైన ప్రజలలో ఆసక్తికర స్పందన
ఈ కొత్త ప్రక్రియ ఆర్టీసీ ప్రయాణికులకు ఆర్టీసీ తో బాండ్ పెంచుతుందని, ఈ అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. రవాణా వ్యవస్థ పైన ప్రయాణికులకు మరింత నమ్మకం, సానుకూల దృక్పథాన్ని కలిగించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం పైన ప్రజలలో ఆసక్తికర స్పందన వస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రయాణికులను ఆప్యాయంగా కండక్టర్లు పలకరిస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.
బస్సు ప్రయాణికులలో మంచి సానుకూల దృక్పధం
ఇది ఆర్టీసీ ప్రతిష్టను మరింత పెంచుతుందని, సంస్థ పట్ల ప్రజల్లో సానుకూల దృక్పథాన్ని మెరుగుపరుస్తుందని ఆర్టీసీ ఉద్యోగులు భావిస్తున్నారు. ఒక నిమిషం పాటు చేసే ప్రయత్నమే అయినప్పటికీ ఇది బస్సు ప్రయాణికులలో ఒక మంచి సానుకూల దృక్పథాన్ని తెస్తుందని బలంగా నమ్ముతున్నారు.












Click it and Unblock the Notifications