తెలంగాణ రాష్ట్ర పండుగగా ‘సదర్’: సర్కారు జీవో జారీ
తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో యాదవ సోదరులు ఎంతో ఘనంగా నిర్వహించే సదర్ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇకపై సదర్ వేడుకలను రాష్ట్ర పండుగగా జరగపనున్నారు. సదర్ సమ్మేళనానికి రాష్ట్ర పండగ హోదా కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఈ సదర్ సమ్మేళనాన్ని యాదవ సోదరులు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.
తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కూడా సదర్ వేడుకలను నిర్వహిస్తున్నారు. దీపావళి తర్వాత రెండో రోజు యాదవ కులస్తులు ఈ సదర్ వేడుకలను నిర్వహిస్తారు. జంట నగరాల్లో ప్రతి సంవత్సరం అత్యంత ఘనంగా సదర్ సమ్మేళనాన్ని నిర్వహిస్తారు. సిటీలోని ముషీరాబాద్ లో నిర్వహించే పెద్ద సదర్ చాలా ఫేమస్. యాదవుల తమ వద్ద గల దున్నపోతుల్లో బలమైన దున్నపోతులను అందంగా అలంకరించి ఈ పండగలో ప్రదర్శిస్తారు.

Telangana Govt has declared Sadar Sammelan an official state festival! Starting this year, celebrations will be organized annually by the Youth Advancement Tourism & Culture Dept across Telangana (except Hyderabad District).#SadarSammelan #TelanganaFestival pic.twitter.com/zNAmpmd7hi
— Informed Alerts (@InformedAlerts) November 2, 2024
దున్నపోతులకు పూల దండలు, గజ్జలు, ముత్యాల మాలలు, పసుపు, కుంకుమలు, పట్టు పరదాలతో అందంగా రెడీ చేసి.. మెయిన్ సెంటర్లు, ప్రధాన వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. యాదవులకు ప్రత్యేకమైన డవక్-దన్కీ-దన్ స్పెషల్ బ్యాండ్ తో దున్నపోతుల చుట్టూ స్టెప్పులు వేస్తూ సంబరాలు చేసుకుంటారు. దున్నపోతులతో కుస్తీ పడుతూ విన్యాసాలు, డ్యాన్సులు చేయిస్తారు. ఇది సదర్ కు స్పెషల్ అట్రాక్షన్. పెద్ద ఎత్తున యువతతోపాటు చిన్నా పెద్దా అంతా కలిసి ఎంతో ఉత్సాహంగా ఈ పండగను జరుపుకుంటారు.
కాగా, ఇటీవల జరిగిన సదర్ సమ్మేళన్ కార్యక్రమ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలనే సదర్ ఉత్సవాలను రాష్ట్ర పండగగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం జీవో జారీ చేయడం గమనార్హం. దీంతో ఇక నుంచి తెలంగాణ రాష్ట్రంలో సదర్ ఉత్సవాలు రాష్ట్ర పండగగా నిర్వహించనున్నారు.
-
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్












Click it and Unblock the Notifications