భార్య ఫోన్ నెంబర్ కాల్ గర్ల్స్ లిస్ట్‌లో పెట్టిన టెక్కీ, రోజు ఎన్నో ఫోన్ కాల్స్

హైదరాబాద్: తన భార్య మొబైల్ ఫోన్ నెంబర్‌ను కాల్ గర్ల్స్ లిస్ట్‌లో పెట్టిన ఓ శాడిస్ట్ భర్త ఉదంతం హైదరాబాదులో వెలుగు చూసింది. కొంతకాలం క్రితమే తన భార్య ఫోన్ నెంబర్‌ను సదరు భర్త పోర్నోగ్రఫీ వెబ్ సైట్‌లో ఉంచాడు. దీంతో, ఆమెకు తరుచూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్లు వచ్చాయి.

హైదరాబాదులో సాఫ్టువేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న మురళీ, భాగ్యలక్ష్మిలు భార్యాభర్తలు. వీరు ఒకేచోట ఎంసీఏ చదివారు. పుణేలో ఉద్యోగం వచ్చింది. ఇద్దరు కలిసి కొద్ది రోజులు ఉన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు సాఫ్టువేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు.

అయితే, భర్త మురళీ ఆ తర్వాత శాడిస్ట్‌గా మారాడు. తన భార్య ఫోన్ నెంబర్‌ను కాల్ గర్ల్స్ లిస్ట్‌లో పెట్టాడు. భార్యను వ్యభిచారిణిగా చిత్రీకరించాడు. ఆమె పేరును పోర్నోగ్రఫీ సైట్‌లో పెట్టడంతో... ఆమెకు ప్రతి రోజు ఎన్నో గుర్తు తెలియని ఫోన్ కాల్స్ వచ్చేవి.

Sadist puts wife's number on callgirls website

దీంతో, ఆమె సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ జరిపి.. ఐపీ అడ్రస్ ద్వారా ఫోన్ నెంబర్‌ను అక్కడి నుంచి కాల్ గర్ల్స్ లిస్ట్‌లో పెట్టారో గుర్తించారు. భర్త ఐపీ అడ్రస్ ఉంది. దీంతో అతని ల్యాప్‌టాప్, సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ప్రేమించానని మోసం చేశాడు

తనను ప్రేమించానని చెప్పి మురళీ మోసం చేశాడని బాధితురాలు వాపోయారు. ఇద్దరం ఎంసిఏ చదివామని, పుణేలో ఉద్యోగం వచ్చిందని చెప్పారు. తన అత్తయ్య తనను కట్నం కింద కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసేదని ఆరోపించారు. అరెస్టు చేసి తనకు న్యాయం చేశారన్నారు. తాను ఓ సాఫ్టువేర్ ఇంజినీర్‌ను అని, తనను రోడ్డుపైకి తెచ్చారన్నారు.

నా కొడుకు అమాయకుడు

మరోవైపు, తన కొడుకు అమాయకుడని, ఇవేం తెలియవని, భార్య ఫోన్ నెంబర్‌ను తన కొడుకు కాల్ గర్ల్స్ లిస్టులో పెట్టలేదని నిందితుడు మురళి తల్లి వాపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+