చీర కడుతూ.. చేయ్యి వేస్తూ అసభ్య ప్రవర్తన ... చివరికీ కటకటాల పాలు ....

హైదరాబాద్ : అతను చేసేది వస్త్ర దుకాణంలో కొలువు. అదీ కూడా సేల్స్ సూపర్ వైజర్.. తమ షాపులోకి వచ్చిన కస్టమర్లకు మంచి చీరలు, డ్రెస్సులు చూపించి .. కొనిపించాలి ... కానీ అతను వక్రబుద్ది చూపించాడు. చీరలు చూపించాల్సిన అతని బుద్ధి గడ్డితిన్నది. ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. చీర కట్టమన్న పాపానికి .. ఎక్కడ పడితే అక్కడ చేతులు వేశాడు. ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిగింది. యువకుడికి మేజిస్ట్రేట్ జైలు శిక్ష విధించడంతో కటకటాల పాలయ్యాడు.

బుద్ధి గడ్డితిన్నది

బుద్ధి గడ్డితిన్నది

వికరాబాద్ జిల్లా కోట్‌పల్లి గ్రామానికి చెందిన చింతకింది యాదగిరి హైదరాబాద్‌లో ఉంటున్నాడు. జగద్గిరిగుట్ట అంజయ్యనగర్‌లో ఉంటూ కూకట్‌పల్లి వై జంక్షన్‌లో గల ఓ వస్త్ర దుకాణంలో సేల్స్ సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికీ జీతంతోపాటు బిజినెస్ చేస్తే కమీషన్ కూడా ఇస్తారు. బిజినెస్ ఇంప్రూవ్ చేసి సెటిల్ కావాల్సిన యువకుని బుద్ధి గడ్డి తిన్నది. ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. చేస్తున్న పని పోయి .. జైలులో ఊచలు లెక్కబెడుతున్నాడు.

 షాపుకొస్తే ..

షాపుకొస్తే ..

గత ఏడాది జూలైన యాదిగిరి పనిచేసే షాపులకు ఓ విద్యార్థిని వచ్చారు. రకరకాల చీరలు చూసి చివరికి ఒక చీరను ఎంపికచేసుకున్నారు. అయితే ఆమె ఒక్కరే రావడం .. చీర కట్టుకోవడం రాలేదు. ఇంకేముంది అక్కడే ఉన్న సేల్స్ సూపర్ వైజర్‌ యాదగిరిని పిలిచారు. తనకు చీర కట్టాలని కోరడమే ఆమె పాలిట శాపంగా మారింది. చీర కట్టమని కోరితే యాదగిరి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ యువతి తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వెంటనే విచారణ చేపట్టారు.

జైలు

జైలు

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసును మేజిస్ట్రేట్ శ్రీదేవి విచారించారు. యువతితో యాదగిరి ప్రవర్తనను తప్పుపడుతూ తీర్పును వెలువరించారు. యువకుడికి ఏడాది జైలు శిక్ష, రెండు వేల జరిమానా విధించారు. అమ్మాయిల పట్ల అనుచితంగా ప్రవర్తించొద్దని మేజిస్ట్రేట్ తీర్పుతో మరోసారి రుజువైంది. మరొకరు ఇలా ప్రవర్తించకుండా ఏడాది జైలు శిక్ష విధించారు న్యాయమూర్తి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+