రాహుల్ జీ రక్షించండి: కొండా సురేఖ వ్యాఖ్యలపై అమల, నాగచైతన్య, రోజా స్పందన

ప్రముఖ సినీ నటులు అక్కినేని నాగార్జున కుటుంబం, నటులు సమంత-నాగచైతన్యల విడాకుల విషయంలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, కొండా సురేఖపై నాగార్జున సతీమణి అమల, కుమారుడు నాగచైతన్య, వైసీపీ నేత, నటి ఆర్కే రోజా మండిపడ్డారు. ఆమె వ్యాఖ్యలు సిగ్గుచేటని ధ్వజమెత్తారు.

'ఒక మహిళా మంత్రి (కొండాసురేఖ) కల్పిత ఆరోపణలు చేస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం కొందరిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం దిగ్భ్రాంతికరం. నా భర్త (అక్కినేని నాగార్జున) గురించి తప్పుడు కథనాలు చెబుతున్న ఇలాంటి వ్యక్తులను నమ్ముతున్నారా? ఇది నిజంగా సిగ్గుచేటు. నేతలు ఇంతలా దిగజారి ప్రవర్తిస్తే మన దేశం ఏమవుతుంది. రాహుల్ గాంధీ.. మీరు వ్యక్తుల గౌరవమర్యాదలను నమ్మినట్లయితే.. దయచేసి మీ నేతలను అదుపులో ఉంచుకోండి. ఆ మహిళా మంత్రి నా కుటుంబానికి చెప్పి, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోండి. ఈ దేశ పౌరులను రక్షించండి' అని అక్కినేని అమల తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు.

Save Rahul Ji Amala on Konda Surekha s comments

కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగచైతన్య ఏమన్నారంటే?

మరోవైపు, అక్కినేని నాగచైతన్య కూడా కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు. తన తండ్రి నాగార్జున చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేశారు. 'మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని.. మీ ప్రత్యర్థులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాను' అని ఎక్స్ వేదికగా నాగచైతన్య పేర్కొన్నారరు.

కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన రోజా

అక్కినేని కుటుంబం, సమంతపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత, నటి ఆర్కే రోజా తీవ్రంగా స్పందించారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబం పై ప్రత్యేకించి సమంతా పై చేసిన జుగుప్షకర వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

కొండా సురేఖపై బీఆర్ఎస్ పార్టీ అనుయాయలు చేసిన పోస్టులను సమాజం వ్యతిరేకించింది. ఆ సందర్భంగా తీవ్ర వేదనకు గురి అయిన కొండా సురేఖ అంత కన్నా హేయమైన వ్యాఖ్యలను తోటి మహిళపై చేయడానికి ఆ మనస్సు ఎలా అంగీకరించింది. మీకు మీ ప్రత్యర్థులకు ఉన్న రాజకీయ వివాదాల్లోకి సంబంధం లేని మహిళను తీసుకురావడం దుర్మార్గం. ఆ పని మహిళే చేయటం మరింత బాధిస్తోంది. ఇలాంటి వేదనాభరిత పరిస్థితి నుంచి అక్కినేని
నాగార్జున కుటుంబం, సమంత మనో ధైర్యంతో అదిగమిస్తుందని ఆశిస్తున్నాను...' అని ఎక్స్ వేదికగా రోజా పేర్కొన్నారు.

కొండా సురేఖ ఏమన్నారంటే.?

తనపై సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో, ఫొటోలతో ట్రోల్ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. ఈ క్రమంలోనే నాగచైతన్య, సమంతల విడాకులకు కేటీఆరే కారణమని కొండా సురేఖ ఆరోపించారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేసింది కేటీఆర్ కాదా? అని ప్రశ్నించారు. హీరోయిన్ల జీవితాలతో ఆడుకుంది కేటీఆర్ అని అన్నారు. మత్తు పదార్థాలు అలవాటు చేసింది కేటీఆర్ అని ఆరోపించారు. దొంగ ఏడుపులు తనకు అవసరం లేదని కొండా సురేఖ అన్నారు.

సిగ్గులేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారు. హరీశ్ రావు మనసున్న మనిషిలా స్పందించారు. నీవెందుకు రియాక్టు కాలేదు.. మనిషివి కాదా.. పశువా అంటూ కేటీఆర్ పై సంచలన విమర్శలు చేశారు. నీకు తల్లి లేదా అని ప్రశ్నించారు. మూడు అకౌంట్లు దుబాయ్ నుంచి పోస్టులు పెడుతున్నారన్నారు. మనుషుల మధ్య అనుబంధాలు సంబంధ విలువలు ఉన్నాయా నీకు? అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. కొంతమంది తొందరగా పెళ్లి చేసుకోవడానికి కేటీఆరే కారణమని సురేఖ అన్నారు.

సినిమా ఇండస్ట్రీ నుంచి కొంతమంది హీరోయిన్లు బయటకు వెళ్లిపోవడానికి కూడా కేటీఆరే కారణమని మండిపడ్డారు కొండా సురేఖ. ఎంతోమంది సినిమా హీరోయిన్ల జీవితాతో కేటీఆర్ ఆడుకున్నారని ఆరోపించారు. దసరా పండుగ ముందు ఆడబిడ్డ ఏడుపు మంచిది కాదన్నారు. ప్రతిదానికీ ట్విట్టర్ లో స్పందించే కేటీఆర్.. తన మీద ట్రోల్ చేసినదానిపై ఎందుకు స్పందించలేదని కొండా సురేఖ ప్రశ్నించారు. ఫొటోలు మార్ఫింగ్ చేయాలనుకుంటే తాము కూడా చేయగలమని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+