లాక్ డౌన్ లోనూ స్కూలు ఫీజులు ... లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ ఇచ్చిన పేరెంట్
కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా ప్రభావం చూపిస్తుంది. లాక్ డౌన్ నేపధ్యంలో ప్రజలు ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఇక ప్రపంచమే ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న వేళ సామాన్య మధ్యతరగతి ప్రజల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. ఇప్పటికే దీంతో లాక్‌డౌన్ అమలవుతున్న నాటి ఇళ్లకే పరిమితం అయిన ప్రజలు పనుల్లేక , పైసల్లేక నానా చావు చస్తున్నారు . ఇక ఈ సమయంలో స్కూళ్ళ నుండి, కాలేజీల నుండి ఫీజులు కట్టమని అడిగితే ఆ చిరాకు ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు .

కార్పోరేట్ స్కూళ్ళు , కాలేజీల ఆన్ లైన్ క్లాసుల వెనుక మతలబు ఇదే
తాజాగా అలాంటి ఒక సందర్భం చోటు చేసుకుంది. ఇక ఆ ఆడియో ఇప్పుడు ఆసక్తికర చర్చకు కారణం అవుతుంది. కరోనా వ్యాప్తిని అరికట్టటానికి ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది . ఇక ఈ నేపధ్యంలో స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. అయితే కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఆన్‌లైన్ క్లాసులకు తెరతీశాయి. కార్పోరేట్ స్కూళ్ళు తమ విద్యర్థుల పట్ల తమకు ఎంతో శ్రద్ధ ఉన్నట్టు బిల్డప్ ఇస్తూ ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. ఇక ఈ క్రమంలో ఎలాగోలా క్లాసుల చెబుతున్నాం కదా, ఫీజులు కట్టమంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో కొందరు తల్లిదండ్రులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.

ఫీజులు కట్టాలని ఒత్తిడి ... కట్టలేమని చెప్తున్న తల్లిదండ్రులు
లాక్ డౌన్ తో ఉద్యోగాలు పోయిన కొందరు, వ్యాపారాలు సాగక కొందరు , జీతాల్లో కోత విధించిన కొందరు ఆర్ధిక కష్టాలలో , నష్టాలలో తెగ ఇబ్బంది పడుతుంటే స్కూల్స్ , కాలేజీల నుండి మీ పిల్లల ఫీజులు చెల్లించండి అంటే ఇక ఆ పరిస్థితి తల్లిదండ్రులకు ఎంత ఇబ్బందికరమో అర్ధం చేసుకోవచ్చు . లాక్‌డౌన్ సమయం నుంచి ఉపాధి లేక అల్లాడుతుంటే.. ఎక్కడ నుంచి డబ్బు తెచ్చి ఫీజులు కట్టాలని తల్లిదండ్రులు నిలదీస్తున్నారు. కొందరు పిల్లల చదువులు ఎలా అని బాధ పడుతున్నారు. ప్రభుత్వాలు కూడా స్కూల్ ఫీజుల కోసం ఒత్తిడి చేయొద్దని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలిచ్చాయి. కానీ ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల యాజమాన్యం మాత్రం ముక్కు పిండి మరీ డబ్బులు వసూలు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాయి.

ఫీజు కట్టమంటే ఓ విద్యార్థి తండ్రి రెస్పాన్స్ ఆడియో వైరల్
తాజాగా ఓ విద్యార్థి తండ్రికి కాల్ చేసిన స్కూల్ సిబ్బందిలో ఓ వ్యక్తి ఫీజు కట్టమని అడిగితే ఫోన్‌లోనే ఆ తండ్రి లెఫ్ట్ అండ్ రైట్ వాయించేశాడు. మీకసలు మానవత్వం ఉందా అని ప్రశ్నించాడు . అసలు లాక్ డౌన్ సమయంలో ఆన్ లైన్ క్లాసులు పెట్టమని మీకు ఎవరు చెప్పారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బ్రతకటం ఎలాగా అని బాధ పడుతుంటే మీకు చదువులు కావాలా అని గట్టిగా నిలదీశారు. అసలే పనుల్లేక , ఇళ్లకే పరిమితమై చాలా ఇబ్బందిలో ఉన్నామని , ఇంకెవరినీ ఈ తరహా ఫీజుల కోసం అడగొద్దని , అనవసరంగా తిట్లు తినొద్దని వాయించేశారు.
Recommended Video

ఫీజు కట్టలేమని ఆగ్రహం.. మానవత్వం ఉందా అని ప్రశ్న .. ప్రభుత్వానికి విజ్ఞప్తి
ఈ వ్యవహారం సీఎం కేసీఆర్ దాకా తీసుకెళ్తామని గడ్డి పెట్టారు . మీ యాజమాన్యం ఎవరో వాళ్ళ నంబర్ ఇవ్వండి మేం మాట్లాడతాం .. ఫీజులు ఇప్పుడు కట్టలేం అని తేల్చి చెప్పారు. లాక్ డౌన్ ముగిసి యధావిధిగా పనులు సాగేవరకు ఫీజులు అడగొద్దని ఆ తండ్రి పేర్కొన్నారు . ఈ టైం లో ఫీజులు అడగటానికి నోరెలా వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకెవరికి ఇలా ఫోన్లు చెయ్యొద్దని హితవు పలికారు. ఇక ఇదే సమయంలో ప్రభుత్వాలు కూడా చొరవ చూపాలని స్కూళ్ళు , కాలేజీల ఫీజుల విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని సామాన్య , మధ్యతరగతి ప్రజలు కోరుతున్నారు.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications