స్కూళ్లకు ఈ వారంలో వరుసగా నాలుగు రోజులు సెలవులు, తాజా ఉత్తర్వులు..!!

పాఠశాలలకు వరుసగా నాలుగు రోజులు సెలవులు రానున్నాయి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నిక ల కోసం సర్వం సిద్దమైంది. ఈ రోజుతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నెల 11న పోలింగ్, 13న కౌంటింగ్ ఉంది. దీంతో.. పోలింగ్ రోజున ప్రభుత్వం.. ప్రయివేటు కార్యాలయాలు... విద్య సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. 13న కౌంటింగ్ జరిగే విద్య సంస్థలకు సెలవు ఇవ్వనున్నారు. ఇక.. 14న రెండో శనివారం, 15న ఆదివారం కావటంతో ఈ వారంలో విద్యార్ధుల కు నాలుగు సెలవులు రానున్నాయి.

తెలంగాణలో విద్య సంస్థలకు ఈ వారంలోనే నాలుగు సెలవులు రానున్నాయి. నాలుగు రోజుల్లో వరుసగా 3 రోజులు సెలవులు వచ్చే ఛాన్స్ ఉంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు, కౌంటింగ్ ఉండటంతో ఈనెల 11.13న, రెండో శనివారం కావటంతో ఫిబ్రవరి 14, ఆదివారం ఫిబ్రవరి 15న ఇలా వారంలో నాలుగు రోజులు సెలవులు రానున్నాయి. అయితే ఈ సెలవులు మున్సిపల్ ఎన్నిక లు జరుగుతున్న ప్రాంతాలకే పరిమితం కానున్నాయి.

Schools holidays for four days in this week due to Municipal elections polling and counting in the state

రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాల్టీలు, ఏడు కార్పోరేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రోజు సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియ నుంది. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం తుది ఏర్పాట్లు చేస్తోంది. పలు స్కూళ్లను పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేసారు. దీంతో పాటుగా 11వ తేదన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సంఘం అన్ని ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు.. విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది.

మున్సిపల్ ఎన్నికల వేళ వరుస సెలవులు

కాగా, విద్యా సంస్థల్లో పోలింగ్ తో పలు చోట్ల 13న కౌంటింగ్ కోసం ఎంపిక చేసారు. అలాంటి చోట్ల 13వ తేదీన కూడా విద్యా సంస్థలకు సెలవు రానుంది. ఇక.. 14, 15 తేదీల్లో రెండో శనివారం.. ఆదివారం కావటంతో మరో రెండు రోజులు వరుస సెలవులు రానున్నాయి. విద్యాశాఖ అధికారులు ఫిబ్రవరి 11న సెలవులు ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. 13న కౌంటింగ్ రాష్ట్రంలోని పలు గవర్నమెంట్, ప్రైవేటు స్కూళ్లలో నిర్వహిస్తున్నారు. దీంతో కౌంటింగ్ జరిగే స్కూల్స్‌కు సైతం ఆ రోజన హాలీడే ఇవ్వనున్నారు.

ఇక.. ఈ రోజు సాయంత్రంతో ప్రచారం పూర్తి కానుంది. పోలింగ్ సమయం వరకు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో.. పురపోరుకు సర్వం సిద్దం అవుతోంది. ఎన్నికల సంఘం ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరవేయాల్సిన సామాను పోలింగ్ సిబ్బందికి అందచేస్తోంది. రేపు మధ్యాహ్నం కు పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకోనున్నారు. కాగా.. ఇలా పాఠశాలలకు ఈ వారంలో వరుసగా సెలవులు రానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+