ఈ రైళ్ల నంబర్లు మార్చిన రైల్వే..! సూపర్ ఫాస్ట్ నుంచి మెయిల్ గా ..!

దక్షిణ మధ్య రైల్వే కొత్త ఏడాదిలో పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు చేస్తోంది. అలాగే ఇంకొన్ని రైళ్లకు తాజా టైం టైబుల్స్ కూడా ఇస్తోంది. దీంతో పాటు పలు రైళ్ల నంబర్లలో మార్పులు చేసింది. వీటిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ కేటగిరీ నుంచి మెయిల్ ఎక్స్ ప్రెస్ కేటగిరీకి మార్చింది. ఈ మార్పులు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో కూడా వెల్లడించింది. దీంతో ఇకపై ప్రయాణాలు చేసే వారు ఈ మార్పుల్ని తప్పకుండా గమనించాల్సి ఉంటుంది.

తాజా మార్పుల ప్రకారం ప్రస్తుతం 12507 నంబర్ తో ప్రతీ మంగళవారం నడుపుతున్న తిరువనంతపురం-సిల్చార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలును కాస్తా 15607గా నంబర్ మార్చడంతో పాటు మెయిల్ ఎక్స్ ప్రెస్ గా స్ధాయి కూడా తగ్గించారు. ఈ మార్పు మార్చి 24 నుంచి అమల్లోకి రానుంది. అలాగే ప్రతీ గురువారం నడుపుతున్న మరో సూపర్ ఫాస్ట్ రైలు నంబర్ 12508ను కాస్తా 15608గా మార్చడంతో పాటు మెయిల్ ఎక్స్ ప్రెస్ స్ధాయికి తగ్గించారు. ఈ మార్పు మార్చి 19 నుంచి అమల్లోకి రానుంది.

SCR Changes Train numbers Categories Specific Trains Downgraded from Superfast to Mail Express

అలాగే చర్లపల్లి నుంచి సిల్చార్ కు ప్రతీ శనివారం నడుపుతున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 12513ను కాస్తా మెయిల్ ఎక్స్ ప్రెస్ గా 15645 నంబర్ తో మార్చారు. ఈ మార్పు మార్చి 21 నుంచి అమల్లోకి రానుంది. అలాగే సిల్చార్ నుంచి చర్లపల్లికి ప్రతీ బుధవారం నడుపుతున్న సూపర్ ఫాస్ట్ రైలు నంబర్ 12514ను కాస్తా 15646గా మెయిల్ ఎక్స్ ప్రెస్ గా మార్చారు. ఈ మార్పు మార్చి 18 నుంచి అమల్లోకి రానుంది.

SCR Changes Train numbers Categories Specific Trains Downgraded from Superfast to Mail Express

అలాగే కోయంబత్తూరు నుంచి సిల్చార్ కు ప్రతీ ఆదివారం నడుపుతున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 12515ను కాస్తా 15627గా మార్చి మెయిల్ ఎక్స్ ప్రెస్ స్ధాయికి తగ్గించారు. ఈ మార్పు మార్చి 29 నుంచి అమల్లోకి రానుంది. దీంతో పాటు సిల్చార్ నుంచి కోయంబత్తూరు జంక్షన్ కు ప్రతీ మంగళవారం నడుపుతున్న సూపర్ ఫాస్ట్ రైలు నంబర్ 12516ను కాస్తా 15628గా మార్చి మెయిల్ ఎక్స్ ప్రెస్ స్ధాయికి తగ్గించారు. ఈ మార్పు మార్చి 24 నుంచి అమల్లోకి రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+