Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు: స్టేషన్స్, టైమింగ్స్ ఇవే..

Sammakka Saralamma Jatara 2024: ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర సమ్మక్క- సారలమ్మ పండగ. రెండు సంవత్సరాలకోసారి జరిగే ఈ పండగను కనివినీ ఎరుగని విధంగా నిర్వహించాలని భావిస్తోంది.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.

ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు ఈ జాతర జరుగనుంది. జాతర తొలి రోజున కన్నేపల్లి నుంచి సారలమ్మను గద్దెపైకి తీసుకొస్తారు. అదే రోజున పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు, నాగులమ్మను మేడారానికి తీసుకొస్తారు. 22వ తేదీన చిలకలగుట్ట నుంచి సమ్మక్క అమ్మవారిని గద్దెపైకి చేర్చుతారు.

SCR to run 30 Jan Sadharan Special Trains for Medaram Jathara 2024

23వ తేదీన వనదేవతలు గద్దెలపై కొలువుతీరుతారు. భక్తులకు దర్శనం ఇస్తారు. 24వ తేదీన సమ్మక్క, సారలమ్మ పగిడిద్దరాజు, గోవిందరాజు, నాగులమ్మ వనప్రవేశం చేస్తారు. మేడారం జాతరగా ఆసియాలోనే అతి పెద్ద గిరిజన పండగగా గుర్తింపు పొందింది.

వనదేవతలకు మొక్కులు చెల్లించుకోవడానికి ఈ నాలుగు రోజుల్లో లక్షలాది మంది భక్తులు మేడారానికి తరలి వస్తారు. తెలంగాణ నుంచే కాకుండా పొరుగునే ఉన్న ఏపీ, ఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా వంటి రాష్ట్రాల నుంచీ భక్తులు ప్రత్యేక వాహనాల్లో వనదేవతలను దర్శించుకోవడానికి వస్తుంటారు.

వారికి రవాణా వసతిని కల్పంచడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు చర్యలు తీసుకున్నారు. 30 జన్ సాధారణ ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. సికింద్రాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి వరంగల్‌‌కు ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.

ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు ప్రతి రోజూ ఉదయం 9:40 నిమిషాలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరే నంబర్ 07014 రైలు మధ్యాహ్నం ఒంటిగంటకు వరంగల్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అదే రోజు మధ్యాహ్నం 1:55 నిమిషాలకు వరంగల్ నుంచి బయలుదేరే నంబర్ 07015 రైలు సాయంత్రం 6:20 నిమిషాలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది.

మౌలాలి, చర్లపల్లి, ఘట్‌కేసర్, బీబీనగర్, భువనగిరి, యాదాద్రి, వంగపల్లి, ఆలేరు, పెంబర్తి, జనగామ, రఘునాథపల్లి, ఘన్‌పూర్, పెండ్యాల, ఖాజీపేట్ మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.

ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు ప్రతి రోజూ తెల్లవారు జామున 5:30 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి బయలుదేరే నంబర్ 07017 రైలు ఉదయం 10 గంటలకు వరంగల్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు వరంగల్ నుంచి బయలుదేరే నంబర్ 07018 రైలు సాయంత్రం 4 గంటలకు సిర్పూర్ కాగజ్ నగర్‌కు చేరుకుంటుంది.

SCR to run 30 Jan Sadharan Special Trains for Medaram Jathara 2024

రాళ్లపేట్, ఆసిఫాబాద్ రోడ్, రేపల్లెవాడ, రెఛ్చి రోడ్, బెల్లంపల్లి, మందమర్రి, రవీంద్రఖని, మంచిర్యాల, పెద్దంపేట్, రామగుండం, రాఘవాపురం, పెద్దపల్లి, కొత్తపల్లి, కోలనూర్, ఓదెల, పోత్కంపల్లి, బిసుగిర్ షరీఫ్, జమ్మికుంట, ఉప్పల్, హసన్‌పర్తి రోడ్, ఖాజీపేట్ టౌన్ మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.

ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు ప్రతి రోజూ ఉదయం 7:05 నిమిషాలకు నిజామాబాద్ నుంచి బయలుదేరే నంబర్ 07019 రైలు మధ్యాహ్నం 1:45 నిమిషాలకు వరంగల్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అదే రోజు మధ్యాహ్నం 2:45 నిమిషాలకు వరంగల్ నుంచి బయలుదేరే నంబర్ 07020 రైలు రాత్రి 10:30 గంటలకు నిజామాబాద్‌కు చేరుకుంటుంది.

కామారెడ్డి, అక్కన్నపేట్, మిర్జాపల్లి, వడీరాం, మనోహరబాద్, మేడ్చల్, బొల్లారం, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, చర్లపల్లి, ఘట్‌కేసర్, బీబీనగర్, భువనగిరి, వంగపల్లి, ఆలేరు, జనగామ, రఘునాథపల్లి, ఘణపూర్, పెండ్యాల, ఖాజీపేట్ మీదుగా రాకపోకలు సాగిస్తుంది.

ఈ నెల 21వ తేదీన సాయంత్రం 4 గంటలకు వరంగల్ నుంచి బయలుదేరే నంబర్ 07023 నంబర్ రైలు మరుసటి రోజు తెల్లవారు జామున 4:30 గంటలకు ఆదిలాబాద్‌కు చేరుకుంటుంది. 22వ తేదీన ఆదిలాబాద్ నుంచి రాత్రి 11:30 గంటలకు బయలుదేరే నవంబర్ 07024 రైలు మరుసటి రోజు మధ్యాహ్నం 12:45 నిమిషాలకు వరంగల్‌కు చేరుకుంటుంది.

ఖాజీపేట్, హసన్‌పర్తి రోడ్, జమ్మికుంట, పెద్దపల్లి, సుల్తానాబాద్, కరీంనగర్, గంగాధర, లింగంపేట్, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, మోర్తాద్, ఆర్మూర్, నిజామాబాద్, బాసర, ధర్మాబాద్, ఉమ్రి, ముద్ఖేడ్, భోకర్, హడ్గావ్ రోడ్, హిమాయత్ నగర్, సహస్రకుండ్, ధనోరా, కిన్వత్, అంబారీ మీదుగా రాకపోకలు సాగిస్తుంది.

ఈ నెల 23వ తేదీన ఖమ్మం నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరే నంబర్ 07021 రైలు మధ్యాహ్నం 12:20 నిమిషాలకు వరంగల్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అదే రోజు వరంగల్ నుంచి మధ్యాహ్నం 1:55 నిమిషాలకు బయలుదేరే నంబర్ 07022 రైలు సాయంత్రం 4:30 గంటలకు ఖమ్మం చేరుకుంటుంది.

మల్లెమడుగు, పాపటపల్లి, డోర్నకల్, గుండ్రాతిమడుగు, మహబూబాబాద్, కేసముద్రం, నెక్కొండ, చింతలపల్లి మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+