'రాబోయే రోజులు ఆన్‌లైన్ మీడియావే' (ఫోటోలు)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టులతో పాటు సోషల్, ఆన్‌లైన్ మీడియాలు కూడా కీలక పాత్ర పోషించాయని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. శనివారం తెలంగాణ ఆన్‌లైన్ జర్నలిస్ట్‌ల యూనియన్ ప్రతినిధులు సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రిడిటేషన్ కార్డులు ఉద్యోగి విధులను అనుసరించి ఇస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రపంచమంతా ఆన్‌లైన్ మీడియాదేనన్నారు. ప్రభుత్వ అక్రిడిటేషన్‌కార్డులు ఉన్న వారికి మాత్రమే హెల్త్ కార్డులు మంజూరు చేస్తామనడంతో సీఎం కేసీఆర్‌ను కలిసి గ్రామీణ ప్రాంతాలలో పని చేసే విలేకరుల పరిస్థితి ఏమిటని చర్చించామన్నారు.
దీంతో పాటు... సోషల్, ఆన్‌లైన్ జర్నలిస్ట్‌ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆన్‌లైన్ జర్నలిస్ట్‌ల యూనియన్ అధ్యక్షుడు కాసుల ప్రతాప్‌రెడ్డి, కార్యదర్శి శ్రీధర్ ధర్మాసనం, సీనియర్ జర్నలిస్ట్ సుమన్ పరాంజి, యూనియన్ ఉపాధ్యక్షుడు రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రెస్ అకాడమీలో అల్లం నారాయణకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని వారు వినతి పత్రం సమర్పించారు.

'రాబోయే రోజులు ఆన్‌లైన్ మీడియావే'
తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టులతో పాటు సోషల్, ఆన్‌లైన్ మీడియాలు కూడా కీలక పాత్ర పోషించాయని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు.

'రాబోయే రోజులు ఆన్‌లైన్ మీడియావే'
శనివారం తెలంగాణ ఆన్‌లైన్ జర్నలిస్ట్‌ల యూనియన్ ప్రతినిధులు సమావేశంలో ఆయన మాట్లాడారు.

'రాబోయే రోజులు ఆన్‌లైన్ మీడియావే'
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రిడిటేషన్ కార్డులు ఉద్యోగి విధులను అనుసరించి ఇస్తామని చెప్పారు.
'రాబోయే రోజులు ఆన్‌లైన్ మీడియావే'
రాబోయే రోజుల్లో ప్రపంచమంతా ఆన్‌లైన్ మీడియాదేనన్నారు. ప్రభుత్వ అక్రిడిటేషన్‌కార్డులు ఉన్న వారికి మాత్రమే హెల్త్ కార్డులు మంజూరు చేస్తామనడంతో సీఎం కేసీఆర్‌ను కలిసి గ్రామీణ ప్రాంతాలలో పని చేసే విలేకరుల పరిస్థితి ఏమిటని చర్చించామన్నారు.

'రాబోయే రోజులు ఆన్‌లైన్ మీడియావే'
దీంతో పాటు... సోషల్, ఆన్‌లైన్ జర్నలిస్ట్‌ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని వివరించారు.

'రాబోయే రోజులు ఆన్‌లైన్ మీడియావే'
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆన్‌లైన్ జర్నలిస్ట్‌ల యూనియన్ అధ్యక్షుడు కాసుల ప్రతాప్‌రెడ్డి, కార్యదర్శి శ్రీధర్ ధర్మాసనం, సీనియర్ జర్నలిస్ట్ సుమన్ పరాంజి, యూనియన్ ఉపాధ్యక్షుడు రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.













Click it and Unblock the Notifications