హైదరాబాద్‌లో సర్వీస్‌నౌ అతి పెద్ద కార్యాలయం: ప్రపంచంలోనే రెండోది
హైదరాబాద్: అమెరికన్ సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ హైదరాబాద్‌లో తన రెండో అతి పెద్ద ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభించింది. నగరంలో ఏర్పాటు చేసిన నూతన కార్యాలయాన్ని సోమవారం రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రారంభించారు. దేశంలో గత పదేళ్లుగా సేవలను అందిస్తున్న కంపెనీ అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ఎంచుకోవడం ఈ నగరానికి ఉన్న ప్రాధాన్యతనేనని అన్నారు జయేశ్ రంజన్.
తెలంగాణ ప్రభుత్వం నగరంలో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యతనివ్వడమే కాకుండా కంపెనీల ఏర్పాటుకు, నిర్వహణకు అత్యంత అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తోందన్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికాకు చెందిన కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా తమ రెండో అతిపెద్ద కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాయని జయేశ్ రంజన్ వివరించారు.

'హైదరాబాద్‌లోని సర్వీస్‌నౌ ఇన్నోవేషన్ సెంటర్ భారతీయ సంస్థలు పనిచేసే విధానాన్ని, డిజిటల్ నైపుణ్యాన్ని పెంపొందించుకోవటంలో తోడ్పడటం పట్ల వారి నిబద్ధతను సూచిస్తుంది. ఈ పెట్టుబడి రాష్ట్రానికి, ప్రజలకు అవకాశాలను తీసుకురావడమే కాకుండా ప్రముఖ టెక్నాలజీ హబ్‌గా హైదరాబాద్ ఖ్యాతిని పెంచుతుంది. సర్వీస్‌నౌ వృద్ధి కథలో భాగమైనందుకు మేము గర్విస్తున్నాము' అని జయేశ్ రంజన్ అన్నారు.
@ServiceNow whose 2nd largest presence anywhere in the world is in Hyd, today inaugurated its innovation centre. A wonderful addition to the already rich and thriving innovation ecosystem of the city @kamolika_peres @MathurSumeet @ServiceNowAsia pic.twitter.com/kS3NuAe7Q8
— Jayesh Ranjan (@jayesh_ranjan) July 17, 2023
"ServiceNow ఇండియా ఎంటర్‌ప్రైజెస్ డిజిటల్ వ్యాపారాలను నిర్మించే విధానాన్ని మారుస్తోంది అని సర్వీస్‌నౌ ఇండియన్ సబ్-కాంటినెంట్ వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ కమోలికా గుప్తా పెరెస్ అన్నారు. "హైదరాబాద్‌లో ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం, మా కస్టమర్‌లు యూఎస్ఏ వెలుపల ఉన్న ServiceNow అతిపెద్ద డెవలప్‌మెంట్ సెంటర్‌లో మా ఇంజనీర్‌లతో నేరుగా సంభాషణలు జరపడానికి వీలు కల్పిస్తుంది, వారి అవసరాలను ఉత్తమంగా తీర్చడానికి వారి వ్యాపార వ్యూహాలకు అనుకూలీకరించిన అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను ఏకీకృతం చేస్తుంది అని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications