హైదరాబాద్ లో తీవ్ర ఉద్రిక్తత

టీజీఎస్ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపుదలకు నిరసనగా భారత్ రాష్ట్ర సమితి నేడు నిర్వహించ దలిచిన ఛలో బస్ భవన్ ఆందోళన, నిరసన ప్రదర్శన నేపథ్యంలో హైదరాబాద్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు బీఆర్ఎస్ టాప్ క్యాడర్ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటోన్నారు. హౌస్ అరెస్ట్ చేస్తోన్నారు. ఆయా నాయకుల ఇళ్ల ముందు పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఎవ్వరూ కూడా బయటికి రాకుండా పహారా కాస్తున్నారు.

Several BRS leaders under House Arrest in Hyderabad

ఇటీవలే టీజీఎస్ఆర్టీసీ బస్ ఛార్జీలు పెరిగిన విషయం తెలిసిందే. డీజిల్ నుండి ఎలక్ట్రిక్ బస్సులకు మారడానికి అవసరమైన నిధులను సమకూర్చడానికి అదనపు ఛార్జీలను విధించాల్సివచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అన్ని సిటీ బస్సు టిక్కెట్లపై 'గ్రీన్ ఫీజు' వసూలు చేస్తోన్నారు. టికెట్‌కు రూ.5 నుంచి రూ.10 వరకు పెంచారు. ఈ మొత్తాన్ని నగరం అంతటా ఎలక్ట్రిక్ బస్ డిపోలు, ఛార్జింగ్ పాయింట్లు, ఇతర మౌలిక సదుపాయాలను నిర్మించడానికి ఉపయోగించనున్నట్లు వివరించారు.

దీనిపై ప్రయాణికుల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. బీఆర్ఎస్ తాజాగా ఛలో బస్ భవన్ ఆందోళనకు పిలుపునిచ్చింది. నేడు ఈ ఆందోళన చేపట్టాల్సి ఉంది. ఆర్టీసీ బస్సుల్లో బస్ భవన్ చేరుకోవాలని బీఆర్ఎస్ నాయకులు నిర్ణయించారు. నందినగర్ నుండి కేటీఆర్, మెహాదీపట్నం నుండి హరీష్ రావు, మహేశ్వరం నుండి సబితా ఇంద్రారెడ్డి, సికింద్రాబాద్ నుండి తలసాని శ్రీనివాస్ యాదవ్, చిలకలగూడ నుండి పద్మారావు గౌడ్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి బస్ భవన్ కు చేరుకోనున్నారు.

అలాగే- దిల్‍సుఖ్‍నగర్ నుండి సుధీర్ రెడ్డి, ఉప్పల్ నుండి లక్ష్మారెడ్డి, ముషీరాబాద్ నుండి ముఠా గోపాల్, మల్కాజిగిరి నుండి మర్రి రాజశేఖర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ నుండి వివేకానంద్ గౌడ్, కూకట్ పల్లి నుండి కృష్ణారావు సిటీ బస్సుల్లో బస్ భవన్ చేరుకుని, పెంచిన టికెట్ ధరలను తగ్గించాలని ఆర్టీసీ ఎండీకి ప్రతిపాదన అందజేయనున్నారు.

ఇందులో పాల్గొనడానికి వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తు నాయకులు, కార్యకర్తలు తరలివస్తోన్నారు. ఈ నేపథ్యంలో- ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదనే ఉద్దేశంతో పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకుంటోన్నారు. హౌస్ అరెస్ట్ లో ఉంచుతున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీమంత్రి హరీష్ రావు ఇంటివద్ద ఈ ఉదయమే పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. వారిని గృహ నిర్బంధంలో ఉంచారు. బయటి వారిని ఎవరినీ కూడా లోనికి వెళ్లనివ్వట్లేదు. లోపలి నుంచి ఎవరినీ బయటికి రానివ్వట్లేదు. ఈ క్రమంలో కొందరు బీఆర్ఎస్ నాయకులు.. పోలీసులతో వాగ్వివాదానికి దిగడం కనిపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+