తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు: రేవంత్ మార్క్.. !!

Telangana DGP: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో బదిలీలకు పూనుకున్నారు. ఇదివరకు పెద్ద ఎత్తున ఐఎఎస్, ఐపీఎస్ అధికారులకు స్థానచలనాన్ని కల్పించారు. దాన్ని కొనసాగిస్తోన్నారు.

ఇప్పుడు తాజాగా రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్‌‌‌గా ఉన్న రవి గుప్తాకు స్థానచలనం కలిగింది. కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ జితేందర్ నియమితులయ్యారు. ఈ మేరకు జీఓ జారీ అయింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కొద్దిసేపటి కిందటే ఈ జీఓను విడుదల చేశారు. రవి గుప్తా.. హోం మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ అయ్యారు.

Several IPS officers transferred in Telangana

డీజీపీగా జితేందర్ బాధ్యతలను స్వీకరించిన వెంటనే భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు చోటు చేసుకున్నాయి. 15 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. మహేష్ భగవత్, స్వాతి లక్రా, స్టీఫెన్ రవీంద్ర, తరుణ్ జోషి, సుధీర్ బాబు, వీ సత్యనారాయణ వంటి సీనియర్ అధికారులు ఈ జాబితాలో ఉన్నారు.

రైల్వేస్ డీజీపీగా ఉన్న మహేష్ భగవత్ అదనపు డైరెక్టర్ జనరల్ (శాంతి భద్రతలు)గా బదిలీ అయ్యారు. అక్కడున్నసంజయ్ కుమార్ జైన్‌ను బదిలీ చేశారు. టీజీఎస్పీ బెటాలియన్ అదనపు డైరెక్టర్ జనరల్ స్వాతి లక్రా.. హోమ్ గార్డ్స్ ఏడీజీగా బదిలీ అయ్యారు. అక్కడున్న స్టీఫెన్ రవీంద్ర బదిలీ అయ్యారు.

గ్రేహౌండ్స్, అక్టోపస్ ఏడీజీపీ (ఆపరేషన్స్) వినయ్ కుమార్ పర్సనల్ విభాగానికి, సంజయ్ కుమార్ జైన్ టీజీఎస్పీ బెటాలియన్స్ ఏడీజీపీగా బదిలీ అయ్యారు. వినయ్ కుమార్ స్థానంలో గ్రేహౌండ్స్, అక్టోపస్ ఏడీజీపీగా స్టీఫెన్ రవీంద్ర అపాయింట్ అయ్యారు. మల్టీ జోన్- 2 ఐజీ జీ సుధీర్ బాబు రాచకొండ పోలీస్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు.

రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి.. ఏసీబీ డైరెక్టర్‌గా, మల్టీజోన్- 1 ఐజీగా ఎస్ చంద్రశేఖర్ రెడ్డి, వెయిటింగ్‌లో ఉన్న కే రమేష్ నాయుడు రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ ఐజీగా, సీఏఆర్ జాయింట్ పోలీస్ కమిషనర్ వీ సత్యనారాయణ మల్టీజోన్- 2 ఐజీగా బదిలీ అయ్యారు.

వనపర్తి ఎస్పీ రక్షిత కే మూర్తి సీఏఆర్ డిప్యూటీ పోలీస్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. హైదరాబాద్ సిటీ సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి మెదక్ ఎస్పీగా.. ఈస్ట్ జోన్ డీసీపీ ఆర్ గిరిధర్.. వనపర్తి ఎస్పీగా నియమితులయ్యారు. మెదక్ ఎస్పీ బీ బాలా స్వామి హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీగా, రాచకొండ టాస్క్‌ఫోర్స్ డీసీపీ జీ చంద్రమోహన్ సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా బదిలీ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+