'ఇవాంకా మళ్లీ మళ్లీ హైదరాబాద్ రావాలి, అప్పుడు పిలుస్తారా, అవమానిస్తారా'
అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు, వైట్ హౌస్ సలహాదారు ఇవాంకా ట్రంప్ మళ్లీ మళ్లీ హైదరాబాద్ రావాలని కాంగ్రెస్ పార్టీ నేత, మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ అన్నారు.
Recommended Video

Global Entrepreneurship Summit : Ivanka Trump reached HICC, Video
హైదరాబాద్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు, వైట్ హౌస్ సలహాదారు ఇవాంకా ట్రంప్ మళ్లీ మళ్లీ హైదరాబాద్ రావాలని కాంగ్రెస్ పార్టీ నేత, మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ అన్నారు.
ఇవాంకా మళ్లీ మళ్లీ వస్తేనైనా హైదరాబాద్ రహదారులు, ఫుట్‌పాత్‌లు బాగుపడతాయని ఎద్దేవా చేశారు. మెట్రో రైలు ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ నేతలను ఆహ్వానించకపోవడాన్ని మరో కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి తప్పుబట్టారు.

ప్రపంచ తెలుగు మహా సభలకు అయినా ఆహ్వానిస్తారా, అవమానిస్తారా అని నిలదీశారు. కేంద్రంలో మెజార్టీ ఉన్నప్పటికీ మోడీ మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును పెట్టడం లేదని కాంగ్రెస్ మహిళా నేతలు మండిపడ్డారు.












Click it and Unblock the Notifications