ఏంటీ సిగ్గులేని రాజకీయాలు..: మంత్రి కొండా వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ ఫైర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. సినీ నటులు నాగచైతన్య, సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ అంటూ ఆరోపించారు. అంతేగాక, సినీ ఇండస్ట్రీలోని హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని, వారిని ఇక్కడ్నుంచి పారిపోయేలా చేశారంటూ కేటీఆర్‌పై కొండా సురేఖ ఆరోపణలు చేశారు.

ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్.. కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఎక్స్ వేదికగా కొండా సురేఖ మాట్లాడిన వీడియో క్లిప్‌ను పోస్టు చేసిన ప్రకాశ్ రాజ్.. ఏంటీ సిగ్గులేని రాజకీయాలు.. సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చిన్న చూపా? అంటూ నిలదీశారు. ఇప్పటికే కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు మంత్రి వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. మరోవైపు ప్రముఖ సినీనటుడు నాగార్జున కూడా తమను మీ రాజకీయాల కోసం వాడుకోవద్దని మంత్రిని సున్నితంగా హెచ్చరించారు.

shameless politics Prakash Raj fires on Minister Konda Surekha s comments

కాగా, నాగచైతన్య, సమంతల విడాకులకు కేటీఆరే కారణమని కొండా సురేఖ ఆరోపించారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేసింది కేటీఆర్ కాదా? అని ప్రశ్నించారు. హీరోయిన్ల జీవితాలతో ఆడుకుంది కేటీఆర్ అని అన్నారు. మత్తు పదార్థాలు అలవాటు చేసింది కేటీఆర్ అని ఆరోపించారు. దొంగ ఏడుపులు తనకు అవసరం లేదని కొండా సురేఖ అన్నారు.

సిగ్గులేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారు. హరీశ్ రావు మనసున్న మనిషిలా స్పందించారు. నీవెందుకు రియాక్టు కాలేదు.. మనిషివి కాదా.. పశువా అంటూ కేటీఆర్ పై సంచలన విమర్శలు చేశారు. నీకు తల్లి లేదా అని ప్రశ్నించారు. మూడు అకౌంట్లు దుబాయ్ నుంచి పోస్టులు పెడుతున్నారన్నారు. మనుషుల మధ్య అనుబంధాలు సంబంధ విలువలు ఉన్నాయా నీకు? అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. కొంతమంది తొందరగా పెళ్లి చేసుకోవడానికి కేటీఆరే కారణమని సురేఖ అన్నారు.

సినిమా ఇండస్ట్రీ నుంచి కొంతమంది హీరోయిన్లు బయటకు వెళ్లిపోవడానికి కూడా కేటీఆరే కారణమని మండిపడ్డారు కొండా సురేఖ. ఎంతోమంది సినిమా హీరోయిన్ల జీవితాతో కేటీఆర్ ఆడుకున్నారని ఆరోపించారు. దసరా పండుగ ముందు ఆడబిడ్డ ఏడుపు మంచిది కాదన్నారు. ప్రతిదానికీ ట్విట్టర్ లో స్పందించే కేటీఆర్.. తన మీద ట్రోల్ చేసినదానిపై ఎందుకు స్పందించలేదని కొండా సురేఖ ప్రశ్నించారు. ఫొటోలు మార్ఫింగ్ చేయాలనుకుంటే తాము కూడా చేయగలమని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+