వెకిలి చేష్టలకు పాల్పడితే ఇక అంతే.. 478 మంది అరెస్ట్ !

ఛాన్స్ దొరికింది కదా అని యువతులు, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాలి అనుకుంటే మీకు మూడినట్టే.. ఓ పక్క పండుగ హడావిడి.. మరోపక్క ఎవరూ చూడట్లేదు కదా అని భావించి వెకిలి చేష్టలకు పాల్పడితే కటకటాల పాలవ్వడం పక్కా అంటూ పోలీస్ సఖ హెచ్చరిస్తుంది.

పండుగల సమయంలో వినోదం పేరుతో కొందరు పోకిరీలు.. సామాజిక బాధ్యత లేని తీరుతో రెచ్చిపోతున్న ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. జనసమూహం ఎక్కువగా ఉందని.. కొందరు కామాంధులు మరింత రెచ్చి పోతుంటారు. గుంపులో కలిసి పోయి ఆడవారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. ఈ పరిస్థితుల్లోనే మహిళలకు అండగా మేమున్నాం అంటూ షీ టీమ్స్ అభయం ఇస్తుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలో పండుగల పేరుతో పాశవికతకు తెరలేపుతున్న వారికి షాక్ ఇచ్చారు.

she-teams-in-hyderabad-arrested-478-persons-for-misbehaving-with-women

మొహర్రం, బోనాల వేడుకల సందర్భంగా మహిళలు, మహిళలను విచక్షిణా రహితంగా తాకుతూ.. అనుచిత పదాలతో వేధింపులకు గురిచేసిన వారికి షాక్ ఇచ్చారు. రహస్య నిఘా కెమెరాల సాయంతో ఈ తరహా ఘటనలను రికార్డ్ చేసి.. మొత్తం 478 మందిని అదుపులోకి తీసుకున్నట్టు డీసీపీ డాక్టర్ ఎన్జేపీ లావణ్య ప్రకటించారు. అరెస్ట్ చేసిన వారిలో 386 మంది మేజర్లు, 92 మంది మైనర్లు ఉన్నారని వెల్లడించారు.

కాగా వారిలో నలుగురిపై POCSO, 354 వంటి సెక్షన్లతో పీటీ కేసులు నమోదు చేసినట్టు వివరించారు. అంతే కాకుండా కొందరికి వార్నింగ్ ఇచ్చి, తల్లిదండ్రుల సమక్షంలో మానసిక కౌన్సిలింగ్ అనంతరం విడుదల చేసినట్లు తెలిపారు.

వినోదం పేరుతో మహిళలను వేధించేవారిని ఉపేక్షించమని డీసీపీ లావణ్య హెచ్చరించారు. రహస్య కెమెరాల సాయంతో ఎప్పటికప్పుడు నిఘా చేపడుతున్నామని.. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వేధింపుల గురించి సాయం కోసం.. షీ టీమ్స్‌ను డయల్ 100, లేదా 9490616555 వాట్సాప్ నెంబర్ ద్వారా సంప్రదించవచ్చని సూచించారు. మెట్రో రైళ్లు, స్టేషన్లు, బస్టాపులు, ఆఫీసులు, కాలేజీల వంటి హాట్‌ స్పాట్లలో వేధింపులు చోటుచేసుకున్నాయని పోలీస్ అధికారుల తెలిపారు. ఆయా ప్రాంతాల్లో డేకాయ్ ఆపరేషన్ల ద్వారా పలువురిని పట్టుకుని జరిమానాలు విధించామని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+