జ్యోతిష్యుడు వేణు స్వామికి షాక్.. ఆయనపై కంప్లైంట్!!

నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల నిశ్చితార్థం పైన వేణు స్వామి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రముఖ వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి నాగచైతన్య శోభిత దూళిపాళ్ల కలిసి ఉండరని, వారు విడాకులు తీసుకుంటారని, నాగచైతన్యకు సంతానం కలిగే అవకాశం లేదని వారిద్దరి జ్యోతిష్యాలను అనాలసిస్ చేసి చెప్పారు.

వేణు స్వామిపై ఫిర్యాదు
అయితే వేణు స్వామి చేసిన తీవ్ర వ్యాఖ్యలకు ఆయన పైన పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ నిర్ణయం తీసుకున్నాయి. నేడు పోలీస్ కమిషనర్, డైరెక్ట్ జనరల్ ఆఫ్ పోలీస్ తో పాటు మహిళా కమిషన్ కు కూడా వేణు స్వామి మీద ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్టు తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ ప్రధానకార్యదర్శి వైజే రాంబాబు తెలిపారు.

Shock for astrologer venu swamy complaint on venu swamy comments on naga chaitanya and sobhita dhulipala

వేణు స్వామితో పాటు పలువురిపై చర్యలకు ఫిర్యాదు
ఇక ఈ ఫిర్యాదు సోషల్ మీడియాలో సినిమా సెలబ్రిటీలకు సంబంధించి అవమానకరమైన వ్యాఖ్యలు, పరువు నష్టం కలిగించే కంటెంట్ ను పోస్ట్ చేసినందుకు బాధ్యులైన వేణు స్వామి తో పాటు పలువురిని లక్ష్యంగా చేసుకుంటుందని ఆయన తెలిపారు. ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా కొందరైనా మారతారని, ఏది పడితే అది మాట్లాడకుండా ఉంటారని భావిస్తున్నారు.

ఫిర్యాదు ఎందుకంటె
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మరియు తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ ఈ ఫిర్యాదుతో భవిష్యత్తులో ముందు ముందు ఎవరు ఇటువంటి అనుచితమైన వ్యాఖ్యలను ఎవరూ చేయకుండా ఉంటారని సురక్షితమైన ఆన్లైన్ వాతావరణాన్ని పెంపొందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వారు భావిస్తున్నారు.

బిగ్ బాస్ లోనూ వేణు స్వామిని తీసుకోవద్దని డిమాండ్
ఇక ఇదే సమయంలో వేణు స్వామికి బిగ్ బాస్ లో చోటు ఇవ్వకూడదనే డిమాండ్ కూడా ప్రధానంగా వినిపిస్తుంది. నాగార్జున ఈ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న క్రమంలో నాగార్జున తనయుడు నాగ చైతన్య అక్కినేని పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వేణు స్వామికి అవకాశం ఇవ్వకూడదని నాగచైతన్య అభిమానులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.

వివాదాల జ్యోతిష్యం చెప్తున్న వేణు స్వామి
నాగ చైతన్య, శోభిత ధూళిపాళ పై సంచలన వ్యాఖ్యలు చేసి చివరగా నా జాతకం తప్పు కావాలని కోరుకుంటున్నా అన్న వేణు స్వామి గతంలో ఏపీ ఎన్నికల సమయంలో జగన్ గెలుస్తాడని బల్ల గుద్ది మరీ చెప్పి, జగన్ ఓటమి పాలు కావటంతో ఆన్ లైన్ లో ఇంకెప్పుడూ జాతకాలు చెప్పను అన్నారు. జానీ మళ్ళీ నాగ చైతన్య నిశ్చితార్ధంతో వివాదాల జ్యోతిష్యాన్ని మొదలెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+