ట్రాఫిక్ చలాన్లపై 100శాతం డిస్కౌంట్స్ పై వాహనదారులకు బిగ్ షాక్!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రాఫిక్ చలాన్ల పైన 100% రాయితీ లభిస్తుంది అన్న అంశం వైరల్ గా మారింది. డిసెంబర్ 13వ తేదీన జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని, పలు భారతీయ రాష్ట్రాలలో జాతీయ లోక్ అదాలత్ లో వాహనదారులు తమ తమ పాత చలాన్ లను తగ్గించిన జరిమానాలతో పరిష్కరించుకోవచ్చని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.
ట్రాఫిక్ చలానాల పైన 100% రాయితీ
డిసెంబర్ 13న ట్రాఫిక్ చలానాల పైన 100% రాయితీ లభిస్తుందని కూడా వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇక దీనిపైన హైదరాబాద్ సిటీ పోలీస్ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో అలర్ట్ ఇచ్చారు. సామాజిక మాధ్యమాలలో ప్రచారం అవుతున్న వార్తలు అవాస్తవమని హైదరాబాద్ సిటీ పోలీసులు స్పష్టం చేశారు. తాము ఎటువంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదని పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో వార్త చూసి సంతోషం
ఇది కేవలం నకిలీ వార్త అని ఎక్స్ వేదికగా వారు తెలియజేశారు. తప్పుడు ప్రచారం పట్ల, సమాచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు కోరారు. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ బకాయిలపై గతంలోలా డిస్కౌంట్ ఇస్తారని తెలంగాణలో చాలామంది ఆశిస్తున్నారు. గతంలో 50 శాతం, వందశాతం డిస్కౌంట్ ఇచ్చినట్టుగా ఇప్పుడు కూడా వస్తుందని భావించిన చాలామంది వాహనదారులు సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది చూసి నిజమని నమ్మి సంతోషపడ్డారు.
హైదరాబాద్ పోలీసుల ప్రకటనపై తీవ్ర నిరాశ
కానీ హైదరాబాద్ పోలీసులు చేసిన ప్రకటన తీవ్ర నిరాశను కలిగించింది. అది నిజం కాదని వారు చెప్పడం ఒకింత బాధకు గురి చేసింది. అయితే ట్రాఫిక్ చలానాల పైన డిస్కౌంట్ ప్రకటించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అన్న అభిప్రాయం కూడా ఒక వర్గం నుండి వస్తోంది. ప్రస్తుతం ప్రచారం అవుతుంది తప్పని, కచ్చితంగా ట్రాఫిక్ పోలీసులు అధికారిక ప్రకటన చేస్తారని కూడా భావిస్తున్న వారు లేకపోలేదు.
𝐅𝐀𝐊𝐄 𝐍𝐄𝐖𝐒 𝐀𝐋𝐄𝐑𝐓
— Hyderabad City Police (@hydcitypolice) December 3, 2025
The viral image claiming “Up to 100% off on Traffic Challans on December 13” is FALSE.
No announcement from Traffic Police
No Lok Adalat notification
Don’t trust or share unverified information.
Always check official Police handles before… pic.twitter.com/hFreCKvT2w
తెలంగాణా ప్రజలకు పోలీసుల షాక్
అధికారిక పోలీస్ హ్యాండిల్స్ లో త్వరలో ఈ ప్రకటన వస్తుందని చాలామంది ఆశిస్తున్నారు. తక్కువ చెల్లింపు లతో భారీ జరిమానాలను చెల్లించవచ్చని, ట్రాఫిక్ జరిమానాలు బకాయిలు లేకుండా క్లియర్ చేసుకోవచ్చని ఆశించిన వారికి ప్రస్తుతం పోలీసులు చేసిన తాజా ప్రకటన షాక్ ఇచ్చింది. హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేయడం సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం సిగ్నల్ జంప్ చేయడం రాంగ్ పార్కింగ్ చేయడం అతివేగంగా వాహన నడపడం డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు చాలామందికి ట్రాఫిక్ చలాన్లు విధించారు.
అయితే ఈ రాష్ట్రాలలో జాతీయ లోక్ అదాలత్ లు
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డిసెంబర్ 13 జాతీయ లోక్ అదాలత్ లు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవి కావని, ఉత్తరప్రదేశ్, హర్యానా, తమిళనాడు, గుజరాత్ వంటి ఇతర రాష్ట్రాల్లో మాత్రమే నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ పోలీసులు చేసిన ఈ ప్రకటనతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఎటువంటి ట్రాఫిక్ చలానాల డిస్కౌంట్ లేదనేది తేలిపోయింది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications