పాడి కౌశిక్ రెడ్డి కి బిగ్ షాక్.. హుజూరాబాద్ లో హస్తం విజయం, ఈటెలకూ ఝలక్!
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో గట్టి షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో ప్రతి చిన్న విషయానికి ఎక్కువ హడావిడి చేసే పాడి కౌశిక్ రెడ్డి కి హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికలలో బిఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందని ప్రకటించుకున్న ఆయనకు ఝలక్ ఇచ్చారు.
హుజూరాబాద్ లో కాంగ్రెస్ హవా
వీణవంక ని తగలబెడతాం అని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి గులాబీ పార్టీ జెండాను హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని ప్రజలు తగలబెట్టేశారు. హుజురాబాద్ మున్సిపాలిటీలో ఎన్నికల కౌంటింగ్ లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోయింది. ఏకంగా 16 వార్డులను కైవసం చేసుకుని ఏకపక్ష విజయాన్ని సాధించింది. అధికార బీఆర్ఎస్ కేవలం 8 స్థానాలకే పరిమితమై గట్టి పోటీ ఇవ్వలేకపోయింది.

పని తక్కువ హంగామా ఎక్కువ చేసే పాడి కౌశిక్ రెడ్డికి షాక్
బిజెపి 5 వార్డులలో మాత్రమే గెలిచి మూడవ స్థానానికి పరిమితమైంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సెంటిమెంట్ అస్త్రంతో విజయం సాధించిన కౌశిక్ రెడ్డి ఆ తర్వాత అనేక వివాదాలలో హైలెట్ కావడం, నియోజకవర్గ అభివృద్ధి కంటే హడావిడి చేయడం పైనే దృష్టి సారించడం ప్రధానంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఎన్నికలలో పాడి కౌశిక్ రెడ్డి ఎంత ప్రచారం చేసినప్పటికీ హుజురాబాద్ ప్రజలు బీఆర్ఎస్ ను ఆదరించలేదు.
కాంగ్రెస్ కు పట్టం కట్టిన హుజూరాబాద్ ప్రజలు
లోకల్ ఎమ్మెల్యేగా అతడి పట్ల ప్రజల వ్యతిరేకత వ్యక్తమౌతుంది అని చెప్పడానికి ఈ ఎన్నికల ఫలితాలు ఒక ఉదాహరణగా చెప్పొచ్చని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. హుజురాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి ఏ పార్టీ పనిచేస్తుందో ఆలోచించి, గెలిపించాలని భావించిన హుజురాబాద్ ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు.
ఈటెల రాజేందర్ కు షాక్ ఇచ్చిన మున్సిపల్ ప్రజలు
ఇక్కడ ప్రజలు పాడి కౌశిక్ రెడ్డికి మాత్రమే కాదు, ఒకప్పుడు ఈటెల రాజేందర్ కి కంచుకోటగా ఉన్న హుజూరాబాద్ లో బిజెపికి కూడా షాక్ ఇచ్చారు. హుజరాబాద్ లో బీజేపీ మూడో స్థానానికి పడిపోయింది. మొత్తానికి హుజురాబాద్ మున్సిపాలిటీ పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసింది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications