ఆ రేషన్ కార్డు దారులకు షాక్.. వారి కార్డులు గోవిందా!

తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు ఉన్న కొందరికి సర్కార్ షాక్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. రాష్ట్రంలో దారిద్ర రేఖకు దిగువన ఉన్నవారికి తెల్ల రేషన్ కార్డులు ఇచ్చి వారికి నిత్య అవసరాలను కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే చాలామంది దారిద్ర రేఖకు దిగువన లేకపోయినప్పటికీ తెల్ల రేషన్ కార్డులు తీసుకుని రేషన్ కార్డుల ద్వారా లబ్ధి పొందడానికి, ప్రభుత్వ పథకాలను పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

వారికి చెక్ పెట్టే పనిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
అటువంటి వారికి చెక్ పెట్టడానికి ప్రభుత్వం రెడీ అవుతుంది. గత ఆరు నెలలుగా రేషన్ కార్డులు ఉన్నప్పటికీ రేషన్ తీసుకోని వారిని గుర్తించి వారి రేషన్ కార్డులను రద్దు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ దిశలో నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

Shock for those ration card holders they will loose their cards

Take a Poll

రేషన్ తీసుకోని కార్డు దారులపై విచారణ
ఆరు నెలల కంటే ఎక్కువ కాలం రేషన్ కార్డులు ఉన్నప్పటికీ రేషన్ తీసుకోని కార్డుదారులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష యాభై తొమ్మిది వేల మంది ఉన్నట్టు గుర్తించిన అధికారులు, ఇక ఈ కార్డు దారులను విచారణ చేయనున్నట్టు సమాచారం. ఈ విచారణలో వీరు అనర్హులు అని తేలితే కార్డులు రద్దు చేయాలని కేంద్రం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది .

నకిలీ రేషన్ కార్డులను రద్దు చేయాలని నిర్ణయం
అయితే ఇప్పటికే 80% కార్డులపై అధికారులు విచారణ చేసినట్టు సమాచారం. ఇప్పటివరకు 30 శాతం అనర్హులుగా తేలినట్టు తెలుస్తుంది. మొత్తం కార్డుదారులలో చాలామంది ఆరు నెలలకు పైగా రేషన్ తీసుకోకపోగా మరికొంతమంది నకిలీ ధృవీకరణ పత్రాలను సమర్పించి రేషన్ కార్డులు పొందిన వారు ఉన్నారని సమాచారం. ఏది ఏమైనా పూర్తిగా వీరి పైన విచారణ జరిపి నకిలీ రేషన్ కార్డులను రద్దు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది.

నిజమైన లబ్దిదారులకు న్యాయం చెయ్యాలని డిమాండ్
ఏది ఏమైనా నకిలీ రేషన్ కార్డు దారుల కార్డులను తొలగించి నిజమైన లబ్దిదారులకు లబ్ది జరిగేలా చూడాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు. రేషన్ షాపుల వద్ద నిత్యావసరాలకు పడిగాపులు పడే సామాన్య ప్రజలు తమా వంటి వారి గోడు పట్టించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+