అన్నంలో విషం కలిపి.. వార్డెన్ సంచలన ఆడియో లీక్.. సస్పెండ్ చేసిన కలెక్టర్..
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ ఎస్సీ బాయ్స్ హాస్టల్ వార్డెన్ కిషన్ నాయక్ ఆడియో ఇప్పుడు సంచలనంగా మారింది. విద్యార్థులకు అన్నంలో విషం పెట్టి చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. హాస్టల్ లో వసతులు, అలాగే తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న నేపథ్యంలో వార్డెన్ తీరుపై విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దాంతో పిల్లలపై కుట్ర పెంచుకున్న వార్డెన్ కిషన్ నాయక్.. అన్నంలో విషం కలపాలంటూ హాస్టల్ సిబ్బందికి ఫోన్ చేశారు. ప్రస్తుతం ఈ ఆడియో వైరల్ కావడంతో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వార్డెన్ కిషన్ నాయక్ ను సస్పెండ్ చేశారు.
పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ ఎస్సీ బాయ్స్ హాస్టల్ వార్డెన్ కిషన్ నాయక్.. ఏకంగా పిల్లలకు అన్నంలో విషం పెట్టి చింపేయండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ అతడ్ని సస్పెండ్ చేశారు.
హాస్టల్ లో వసతులు సరిగ్గా లేకపోవడం.. విద్యార్థులతో వార్డెన్ అసభ్య ప్రవర్తనను నిరసిస్తూ విద్యార్థులు గురువారం రాత్రి కడ్పల్- సిర్గాపూర్ రహదారిపై ఆందోళన చేపట్టారు. దాంతో వారిపై కోపం పెంచుకున్న వార్డెన్.. శుక్రవారం ఉదయం మద్యం మత్తులో హాస్టల్ కు చేరుకుని విద్యార్థులపై బూతులతో రెచ్చిపోయాడు. అంతేకాక.. హాస్టల్ సిబ్బందికి ఫోన్ చేసి.. నా మీదనే ఫిర్యాదు చేస్తారా..? వాళ్ల అన్నంలో విషం పెట్టి చింపేయండి..? అని ఆదేశాలు ఇచ్చాడు.

అయితే ఇందుకు సంబంధించిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దాంతో ఈ ఘటనపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య వెంటనే స్పందించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించడమే కాకుండా విద్యార్థుల ప్రాణాలు తీయాలని చూసిన వార్డెన్ కిషన్ నాయక్ ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications