Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

షాకింగ్ ఘటన.. మరో 100 కుక్కలకు విషం పెట్టి చంపేశారు..!

తెలంగాణలో వీధి కుక్కలపై దాష్టీకం కొనసాగుతూనే ఉంది. ఇటీవల కామారెడ్డి, హనుమకొండ జిల్లాల్లో దాదాపు 600లకు పైగా వీధి కుక్కలకు విషం పెట్టి చంపేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా హైదరాబాద్ సమీపంలో మరో షాకింగ్ ఘటన జరిగింది. యాచారం గ్రామంలో దాదాపు 100 కుక్కలకు విషం ఇచ్చి చంపినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి సర్పంచ్, మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

తెలంగాణలో వీధి కుక్కలను చంపుతున్న ఘటనలు వరుసగా నమోదవుతున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఓ జంతు సంక్షేమ కార్యకర్త యాచారం పోలీస్ స్టేషన్‌ లో దాఖలు చేసిన ఫిర్యాదులో.. జనవరి 19 న కుక్కలకు కొన్ని విషపూరిత పదార్థాలను ఇంజెక్ట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాదాపు 100 కుక్కలను హత్య చేశారని వివరించారు.

ఈ మేరకు ఇదే ఘటనపై యాచారం గ్రామ సర్పంచ్, కార్యదర్శి, ఓ వార్డు మెంబర్ పై జంతువులపై క్రూరత్వ నివారణ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదే విషయంపై తదుపరి విచారణ కొనసాగుతోందని స్పష్టం చేశారు. అలాగే వీధి శునకాల కళేబరాలను కనుక్కోవడానికి దర్యాప్తు జరుగుతుందని అన్నారు.

Shocking CShocking Cruelty Near Hyderabad Nearly 100 Stray Dogs Poisoned to Death in Yacharamruelty Near Hyderabad Nearly 100 Stray Dogs Poisoned to Death in Yacharam

మరోవైపు ఇటీవల కామారెడ్డి జిల్లా మాచారెడ్డి పోలీస్​ స్టేషన్​ పరిధిలోని పలు గ్రామాల్లో వీధి కుక్కలను చంపిన ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. పాల్వంచ మండల కేంద్రంతో పాటు ఫరీద్​ పేట్, బండరామేశ్వర్ ‌పల్లి, భవానీపేట, వాడి తదితర గ్రామాల్లో 600 లకు పైగా వీధి కుక్కలను చంపేశారు. ఇక ఇంజెక్షన్లు, గుళికలు ఇవ్వడంతోనే కుక్కలు మృతి చెందినట్లు తెలుస్తోంది. జంతు హక్కుల కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ మేరకు ఐదుగురు సర్పంచులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+