హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విక్రమ్ అరెస్ట్, కానీ, ఇదీ ఆస్తి లెక్క!: కాల్పులు డ్రామానా తెలియదే.. భార్య షిఫాలి, హంగామా

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్‌ను బుధవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. అప్పులు తీర్చేందుకు, రాజకీయ లబ్ధి కోసం విక్రమ్ కాల్పుల డ్రామా ఆడిన విషయం తెలిసిందే.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్‌ను బుధవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. అప్పులు తీర్చేందుకు, రాజకీయ లబ్ధి కోసం విక్రమ్ కాల్పుల డ్రామా ఆడిన విషయం తెలిసిందే.

తాను తీసుకున్న గోతిలో తానే పడ్డ విక్రమ్ గౌడ్తాను తీసుకున్న గోతిలో తానే పడ్డ విక్రమ్ గౌడ్

ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం పోలీసులు అతను చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లారు. వైద్యులను అఢిగి అతని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. అనంతరం మరోసారి పోలీసులు విక్రమ్ స్టేట్‌మెంట్ తీసుకున్నారు. ఆయనను కోర్టుకు తరలించనున్నారు. ఆసుపత్రి వద్ద అనుచరులు హంగామా సృష్టించారు.

అరెస్టు చేసినప్పటికీ మానవతా దృక్పథంతో

అరెస్టు చేసినప్పటికీ మానవతా దృక్పథంతో

ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారనే దానిపై చర్చ జరిగింది. ఆయనను అరెస్టు చేసినట్లు పోలీసులు అధికారికంగా ధ్రువీకరించారు. అయితే, గాయపడి చికిత్స పొందుతుండటంతో మానవతా దృక్పథంతో ఆసుపత్రిలోనే ఉంచనున్నారు. ఇప్పటికిప్పుడు పోలీస్ స్టేషన్ తరలించరు.

కాల్పుల్లో 11 మంది పాత్రధారులు వీరే

కాల్పుల్లో 11 మంది పాత్రధారులు వీరే

తనపై కాల్పుల ఘటనలో కథ, స్క్రీన్ ప్లే అంతా విక్రమ్ గౌడ్‌దే. ఇందులో మొత్తం 11 మంది పాత్రదారులు ఉన్నారు. ఇప్పటికి పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. ఏ1 విక్రమ్ గౌడ్, ఏ2 నందు, ఏ3 షేక్ అహ్మద్, ఏ4 రయీస్ ఖాన్, ఏ5 బాబు జాన్, ఏ6 గోవింద రెడ్డి

డ్రామానా తెలియదే: భార్య షిఫాలి, బావమరిది

డ్రామానా తెలియదే: భార్య షిఫాలి, బావమరిది

షార్ప్ షూటర్ నందు మూడు రోజుల ముందు తమ ఇంటికి వచ్చినట్లు విక్రమ్ భార్య షిఫాలి పోలీసుల ఎదుట అంగీకరించారని తెలుస్తోంది. అయితే, అతనితో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలియదని చెప్పారని సమాచారం. విక్రమ్ బావమరిది కూడా ఈ డ్రామాపై విస్మయం వ్యక్తం చేశాడని సమాచారం. కాల్పుల ఘటనలో షిఫాలి పాత్ర లేదని భావిస్తున్నామన్నారు.

విక్రమ్ గౌడ్ ఆస్తులు, అప్పులపై చర్చ

విక్రమ్ గౌడ్ ఆస్తులు, అప్పులపై చర్చ

విక్రమ్ గౌడ్ అప్పుల నేపథ్యంలో కాల్పుల డ్రామాకు తెరలేపాడు. దీంతో అతని వద్ద ఆస్తి లేదా అనే చర్చ సాగుతోంది. పబ్బుల్లో, వ్యాపార రంగాల్లో అతను నష్టపోయాడు. దీంతో అప్పు అయ్యాడు. కోట్లాది రూపాయల అప్పు ఉండటంతో తీర్చలేకపోతున్నాడని తెలుస్తోంది. దానిని తండ్రి ఇచ్చేందుకు నిరాకరించాడని అంటున్నారు.

విక్రమ్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ ఇలా..

విక్రమ్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ ఇలా..

2016 గ్రేటర్ ఎన్నికల్లో విక్రమ్ గౌడ్ పోటీ చేశారు. ఆయన దాఖలు చేసిన అఫిడవిట్‌లో రూ.6.5 లక్షల నగదు, ఫార్చునర్ వాహనంతో పాటు తన ఆస్తిని రూ.37.70 లక్షలుగా చూపించాడు. భార్య పేరిట 56,12,500 చూపించాడు. అందులో 2 కిలోలకు పైగా బంగారం. ఇవి కాకుండా భార్య చేతిలో రూ.5.50 లక్షలు చూపించాడు. ఇవి తప్ప తన వద్ద స్థిర, చరాస్తులు ఏమీ లేవని పేర్కొన్నాడు.

ఇదీ అప్పుల చిట్టా అంటూ..

ఇదీ అప్పుల చిట్టా అంటూ..

2014-15లో తన వార్షిక ఆదాయం రూ.11,75,541 కాగా, భార్య ఆధాయం రూ.8,45,550గా పేర్కొన్నాడు. బ్యాంకులు, ఇతర ప్రభుత్వ సంస్థలకు తన పేరిట రూ.20 లక్షలు, భార్య పేరిట రూ.25 లక్షలు అప్పు ఉన్నట్లు అఫిడవిట్ సమర్పించాడు.

English summary
Former Minister Mukesh Goud's son Vikram Goud arrested on Wednesday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X