Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శిరీష కేసులో మరో ట్విస్ట్: శ్రవణ్ వల్లే ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య

బ్యూటీషీయన్ శిరీష కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న శ్రవణ్ అత్యుత్సాహం వల్లే కుకునూర్ పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకొన్నారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. శిరీష వి

హైదరాబాద్: బ్యూటీషీయన్ శిరీష కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న శ్రవణ్ అత్యుత్సాహం వల్లే కుకునూర్ పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకొన్నారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. శిరీష విషయం బయటపడితే పరువుపోతోందనే భయంతోనే ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకొన్నారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ విషయాన్ని ప్రభాకర్ రెడ్డి సతీమణి రచన ఖండిస్తున్నారు. ప్రభాబకర్ రెడ్డిని హత్య చేశారని ఆమె అరోపిస్తున్నారు.

బ్యూటీషీయన్ శిరీష కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యను ఈ కేుసుతో లింక్ చేయకూడదని ప్రభాకర్ రెడ్డి కుటుంబసభ్యులు కోరుతున్నారు.

ప్రభాకర్ రెడ్డి మరణానికి సంబంధించిన విషయాలపై పోలీసులు ఎందుకు గోప్యతను ప్రదర్శిస్తున్నారో చెప్పాలని ఆయన భార్య రచన డిమాండ్ చేస్తున్నారు. బ్యూటీషీయన్ శిరీషతో తన భర్తకు సంబంధం ఉండదని రచన అభిప్రాయపడుతున్నారు.

సిసిటివి పుటేజీని ఎందుకు బయటపెట్టడం లేదని ఆమె ప్రశ్నించారు. ఈ రెండు కేసులను వేర్వేరుగా చూడాలని ప్రభాకర్ రెడ్డి కుటుంబసభ్యులు కోరుతున్నారు. ప్రభాకర్ రెడ్డి చనిపోయిన రోజు కుర్చీలో ఉన్న పరిస్థితిని చూస్తే ఆత్మహత్య కాదని, హత్యేననే అనుమానాలను వారు వ్యక్తం చేస్తున్నారు.

శ్రవణ్ అత్యుత్సాహం

శ్రవణ్ అత్యుత్సాహం

బ్యూటీషీయన్ శిరీష కేసులో ఏ1 నిందితుడుగా ఉన్న శ్రవణ్ అత్యుత్సాహన్ని చూపాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇటీవల రెండురోజుల పాటు పోలీస్ కస్టడీకి తీసుకొన్న తర్వాత మరోసారి కేసులో సీన్ టూ సీన్ ను స్టడీ చేశారు బంజారాహిల్స్ పోలీసులు. శిరీష ఆత్మహత్య చేసుకోగానే ఆ సమాచారాన్ని శ్రవణ్ ఎస్ఐ ప్రభాకర్ రెడ్డికి అందించారు. అంతేకాదు ఈ కేసులో విచారణ తీరును ఎప్పటికప్పుడు ప్రభాకర్ రెడ్డికి సమాచారం అందించేవాడు. అంతేకాదు మీడియాలో వస్తున్న వార్తలను కూడ శ్రవణ్ అప్ డేట్ చేశారు. ఈ కేసులో ప్రభాకర్ రెడ్డిని భయాందోళనలకు గురిచేసే రీతిలో శ్రవణ్ వ్యవహరించాడనే అభిప్రాయంతో పోలీసులున్నారు.

 ప్రభాకర్ రెడ్డికి బిపి డౌన్ ఎందుకు అయింది?

ప్రభాకర్ రెడ్డికి బిపి డౌన్ ఎందుకు అయింది?

కుకునూర్ పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డికి బిపి డౌన్ అయి సైలైన్ పెట్టుకొన్నాడు. బ్యూటిషీయన్ శిరీష కేసు విషయమై శ్రవణ్ తాజాగా సమాచారాన్ని అందించాడు. అయితే ఈ కేసు విషయమై శ్రవన్ ప్రదర్శించిన అత్యుత్సాహం వల్ల ఎస్ఐ ప్రభాకర్ రెడ్డికి బిపి డౌన్ అయింది. అయితే బిపి డౌన్ అయిన విషయం తెలియగానే డాక్టర్ ను పిలిపించుకొని క్వార్టర్ లోనే సెలైన్ పెట్టించుకొన్నాడని పోలీసులు గుర్తించారు.

క్వార్టర్లో ఏం జరిగిందనేది తేలాలి?

క్వార్టర్లో ఏం జరిగిందనేది తేలాలి?

ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి క్వార్టర్ లో ఏం జరిగిందనే విషయమై మరింత స్పష్టత తేలాల్సి ఉంది. అయితే బ్యూటీషీయన్ శిరీషపై ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.అయితే ఫోరెన్సిక్ ప్రాథమిక నివేదిక ఆధారంగా శిరీషపై అత్యాచారం జరగలేదని తేలినట్టు సమాచారం. అయితే తన స్నేహితులు వస్తున్నారని చెప్పి హొంగార్డు బిక్షపతితో కోడికూర, బోజనం తయారుచేయించారు ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి.అయితే క్వార్టర్ లో శిరీష అరిచిన సమయంలో డ్యూటీలో ఉన్న సెంట్రీకి విన్పించలేదని సెంట్రీ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ చెబుతున్నారు. మరో వైపు రాజీవ్, శ్రవణ్, శిరీష ఎస్ఐ క్వార్టర్ కు వచ్చిన విషయాన్ని ఎవరూ కూడ చూడలేదనంటున్నారు. అయితే సెంట్రీ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ కు స్నేహితులు వస్తున్నారని ప్రభాకర్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం మేరకు రాజీవ్ బృందాన్ని సెంట్రీ లోపలికి అనుమతిచ్చారు.

ప్రభాకర్ రెడ్డిది హత్యే

ప్రభాకర్ రెడ్డిది హత్యే

కుకునూర్ పల్లి ఎష్ఐ ప్రభాకర్ రెడ్డిది ఆత్మహత్య కాదు హత్యే అంటున్నారు ఆయన భార్య రచనారెడ్డి. కుర్చీలో ప్రభాకర్ రెడ్డి మృతదేహం పడిపోయిన తీరుతో పాటు, ఆయుధం ఉన్న తీరు పట్ల ఆమె అనుమానాలను వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకొన్న వ్యక్తి కుర్చీలో వేరే రకంగా ఉంటారని ఆమె మీడియాకు చెప్పారు. ఉన్నతాధికారుల వేధింపులున్నాయని ప్రభాకర్ రెడ్డి తనతో చెప్పేవారని ఆమె గుర్తుకు తెచ్చుకొన్నారు. శిరీషపై అత్యాచారం చేసే ప్రయత్నం చేసినట్టు వచ్చిన వార్తలను ఆమె ఖండించారు.

 శ్రవణ్ ను కఠినంగా శిక్షించాలి

శ్రవణ్ ను కఠినంగా శిక్షించాలి

రెండు కుటుంబాల్లో విషాదానికి కారణమైన శ్రవణ్ ను కఠినంగా శిక్షించాలని ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి భార్య రచనారెడ్డి డిమాండ్ చేశారు. ప్రభాకర్ రెడ్డి కేసు విషయంలో అసలు విషయాలను బయటపెట్టాలని ఆమె కోరారు.అంతేకాదు ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి కాల్ డేటాను బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. అంతేకాదు తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె ప్రభుత్వాన్ని పోలీసు ఉన్నతాధికారులను కోరారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+