పెళ్లికాని ప్రసాదులకు శుభవార్త.. మీ కల నెరవేరే సమయం వచ్చేసిందిగా!
ఏ సంవత్సరంలో అయినా వివాహాలు జరిపించేందుకు వేదపండితులు, పురోహితులు వేదక్యాలెండర్ ప్రకారం శుభముహుర్తాలు,అమృత ఘడియలు చూసి పెళ్లిళ్లు చేసుకునే తేదీలను ఖరారు చేస్తారు. పెళ్లి చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్న యువత కోసం ఒక శుభవార్త వచ్చింది. ఎప్పుడెప్పుడు శుభ గడియలు వస్తాయని ఎదురుచూస్తున్న వారికి ఆ సమయం దగ్గరగా వచ్చింది. ఎన్నో ఆశలతో జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని.. భాగస్వామి తమ జీవితంలోకి ఆహ్వానించాలని కోరుతున్న వారికి గుడ్ న్యూస్ వచ్చింది. ఆషాడ మాసానికి ముందు ఆగిపోయిన పెళ్లి బాజాలు మళ్లీ మోగే సమయం ఆసన్నమైంది. త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి.
మరో 15 రోజుల్లో శుభముహూర్తాలు ప్రారంభం కానుండడంతో కళ్యాణ మండపాలు, జ్యువెలరీ షాపులు, వస్త్ర దుకాణాలు సందడిగా మారే సమయం కూడా ఆసనమైంది. వివాహ శుభకార్యాల వల్ల 20 నుంచి 25 రంగాలకు చెందిన వందలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనోపాధి దొరుకుతుంది. ఎంతో మందికి చేతి నిండా పని దొరకడంతో పాటు పల్లెలు, పట్టణాలు సందడిగా మారనున్నాయి. శుభముహూర్తాలు జులై 26 నుంచి ప్రారంభమై.. నవంబర్ 27 వరకు కొనసాగనున్నట్లు వేదపండితులు వెల్లడించారు.

ఈ ఏడాది ప్రారంభంలో తక్కువ శుభముహూర్తాలు ఉండడం వల్ల ఎక్కువగా వివాహాలు జరగలేదు. మంచి గడియలు లేవన్న కారణంగా చాలా మంది తమ పెళ్లిళ్లను వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు అలాంటి పెళ్లికానీ ప్రసాదులకు జులై మాసం శుభవార్తను మోసుకొచ్చింది. జులైలో 26, 30, 31 తేదీలలో మంచి ముహూర్తాలు ఉన్నాయని.. ఆగస్టు 1, 2, 5, 6, 7, 8, 9 తేదీలలో మంచి గడియలు ఉన్నాయని పండితులు పేర్కొంటున్నారు. ముహుర్తాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో బాజాలు మోగాల్సిందే.
జులై నుంచి నవంబర్ వరకు ఉన్న శుభముహూర్తాలు ఇవే..
*జులై - 26, 30, 31 తేదీలు
*ఆగస్టు - 1, 2, 5, 6, 7, 8, 9 తేదీలు
*సెప్టెంబర్ - 23, 24, 26, 27, 28 తేదీలు
*అక్టోబర్ - 1 ,2, 3, 4, 7, 8, 10, 11, 12, 16, 17, 22, 23, 24, 26, 28, 29, 30, 31
*నవంబర్ - 1, 2, 4, 7, 12, 13.












Click it and Unblock the Notifications