యువతి ఫోటోలను మార్పింగ్ చేసి ఫేస్ బుక్ లో పోస్ట్, పెళ్ళి వద్దన్నందుకే ?

హైదరాబాద్: పెళ్ళి చేసుకోవాలని అడిగాడు, ఆ యువతి నిరాకరించింది.అయితే ఆమె తనతో సన్నిహితంగా ఉన్న సమయంలో తీసిన ఫోటోలను మార్పింగ్ చేసి అసభ్యంగా ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. ఆరుమాసాలుగా ఆ యువతిని వేధిస్తున్నా

హైదరాబాద్: పెళ్ళి చేసుకోవాలని అడిగాడు, ఆ యువతి నిరాకరించింది.అయితే ఆమె తనతో సన్నిహితంగా ఉన్న సమయంలో తీసిన ఫోటోలను మార్పింగ్ చేసి అసభ్యంగా ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. ఆరుమాసాలుగా ఆ యువతిని వేధిస్తున్నాడు. దీంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

హైద్రాబాద్ మియాపూర్ కు చెందిన కొండబోయిన శ్యామ్ కు ఓ పెళ్ళిలో ఓ యువతితో పరిచయమేర్పడింది.కొన్నిరోజులు వారిద్దరూ స్నేహంగా ఉన్నారు. ఇద్దరు స్నేహంగా ఉన్న సమయంలో ఫోటోలను తన ఫోన్ లో తీసుకొన్నాడు శ్యామ్.

కొన్ని రోజుల తర్వాత ప్రేమించాలని ఆ యువతిని కోరాడు. అంతేకాదు పెళ్ళి చేసుకోవాలని కూడ ఆయన వేధించాడు. ఈ ప్రతిపాదనకు ఆ యువతి నిరాకరించింది.ఆ యువతి నిరాకరణతో నిందితుడు ఆమెపై కక్ష పెంచుకొన్నాడు.

harassement

గూగుల్ ప్లే స్టోర్ నుండి ఓ యాప్ ను తీసుకొని బాధితురాలి ఫోటోలను మార్పింగ్ చేశఆడు. యువతి పేరుతో నకిలీ ఫేస్ బుక్ ఖాతాను తెరిచి అందులో పోస్ట్ చేశాడు. స్నేహితులకు, బంధువులకు పంపాడు.

ఆరుమాసాలుగా ఆ యువతిని అతడు వేధింపులకు గురి చేశాడు. ఈ వేధింపులకు తాళలేక ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. సైబర్ క్రైమ్ పోలీసులే కాల్ డేటా ఆధారంగా నిందితుడిని గుర్తించి, అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+