Ration Card: కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఎప్పటి నుంచి అంటే..!
తెలంగాణలో ఎంత మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. పేదల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించింది. ప్రజా పాలనలో భాగంగా తెలంగాణ ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబర్ 28, 2023 నుంచి జనవరి 6, 2023 మధ్య దరఖాస్తు చేసుకున్నారు.
ఆ తర్వాతే తెలంగాణలో రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలు అమలు చేశారు. అయితే కొత్త రేషన్ కార్డులు మాత్రం మంజూరు చేయలేదు. రేషన్ కార్డు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో రేషన్ కార్డుల ఈ కేవైసీ ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే తాజా ఎన్నికల కోడ్ రావడంతో కొత్త రేషన్ కార్డుల జారీ వాయిదా పడినట్లు తెలుస్తోంది.

ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి..అర్హులను గుర్తించాల్సి ఉంది. అర్హులను గుర్తించిన తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు. అయితే ప్రస్తుతం రేషన్ కార్డులకు సంబంధించి ఎలాంటి పురోగతి లేదు. జూన్ లోనే దరఖాస్తుల పరిశీలన ఆ తర్వాత కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేసే అవకాశం. ఇందుకోసం రెండు నుంచి మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు రూ.500 గ్యాస్ సిలిండర్, 200 ఉచిత పథకాలు రావు.
ప్రభుత్వ పథకాలు పొందాలంటే రేషన్ కార్డులు ఉండాలి. అందుకే లక్షల మంది కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారు. కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తే ప్రభుత్వంపై భారం పడే అవకాశం ఉంది. అందుకే గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను సరిగా జారీ చేయలేదు. అయితే ఈ కేవైసీ లేని వారి పేర్లను తొలగించనున్నారు. దీంతో ప్రభత్వం భారం తగ్గే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications