New Ration Card: కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటి నుంచి అంటే..!

తెలంగాణలో నివసిస్తున్న పేదలు కొత్త రేషన్ కార్డు కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డుల జారీ ఆగిపోవడంతో చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం వెయ్యి కళ్లతో వేచి చూస్తున్నారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో కొత్త రేషన్ కార్డులు వస్తాయని చాలా మంది ఆశతో ఉన్నారు. ఇందుకు తగ్గట్లుగానే ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి సిద్ధమైంది. కొత్త రేషన్ కార్డుల కోసం గతేడాది డిసెంబర్ 28 నుంచి దరఖాస్తులు స్వీకరించింది.

ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో చాలా మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. 200 యూనిట్ల వరకు జీరో కరెంట్ బిల్ పథకం వర్తించాలంటే.. రేషన్ కార్డు ఉండాల్సిందే. రేషన్ కార్డు లేక చాలా మందికి పథకాలు రావడం లేదు. అందుకే చాలా చాలా మంది కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకున్నారు. జిల్లాల వారీగా భారీగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలో ఒక్కో జిల్లాలో ఇప్పటికే 55 వేలకు పైగా రేషన్ కార్డుల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి.

Since when new ration cards are being issued

దాదాపు 9 లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు దరఖాస్తులను పరిశీలించి రేషన్ కార్డులను జారీ చేయనున్నారు. ఇందుకు కసరత్తు కూడా స్టార్ట్ చేశారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో రేషన్ కార్డుల ఈ కేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ కేవైసీ ద్వారా బోగస్ రేషన్ కార్డులను తొలగించనున్నారు. కొన్ని కార్డుల్లో సభ్యులు చనిపోవడమో లేదా పెండ్లి చేసుకొని వేరే ఇంటికి వెళ్లిపోవడమో జరిగినా వారి పేర్లను తొలగించకుండా రేషన్ తీసుకుంటున్నారు.

అలాంటి వారి పేర్లను తొలగించడం కోసమే ఈకేవైసీ ప్రక్రియ మొదలు పెట్టారు. రాష్ట్రంలో ఈకేవైసీ ప్రక్రియ దాదాపు పూర్తయింది. దీంతో కొత్త రేషన్ కార్డుల జారీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి ఇస్తారు అనేది తెలియడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల కోడ్ కోనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికల తర్వాతే కొత్త రేషన్ కార్డుల జారీ ఉండే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+