గాయని కల్పన ఆరోగ్యపరిస్థితి ఇలా.. పోలీసుల అదుపులో కల్పన భర్త!
ప్రముఖ నేపథ్యగాయని కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్టు, నిద్ర మాత్రలను మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అపస్మారక స్థితిలో మంగళవారం రాత్రి కేపీహెచ్బీ లోని హోలిస్టిక్ ఆసుపత్రిలో చేరిన గాయని కల్పనకు చికిత్స కొనసాగుతుంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.
గాయని కల్పన ఆరోగ్యంపై ప్రముఖ గాయనీ గాయకుల ఆందోళన
ఇక ఇప్పటికే ప్రముఖ నేపథ్య గాయని కల్పన ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందుతున్న పలువురు సినీ ఇండస్ట్రీకి చెందిన గాయనీ గాయకులు మంగళవారం రాత్రి ఆసుపత్రికి చేరుకుని ఆమె ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సునీత, గీతా మాధురి, శ్రీకృష్ణ, కారుణ్య తదితరులు ఆసుపత్రికి వెళ్ళిన వారిలో ఉన్నారు.

భర్తకు ఫోన్ చేసి మాట్లాడిన కవిత
హైదరాబాద్ కెపిహెచ్బి లోని ఒక విల్లాలో ఉంటున్న కల్పన నిన్న సాయంత్రం చెన్నైలో ఉన్న తన భర్తకు ఫోన్ చేసి తాను అపస్మారక స్థితిలోకి వెళ్లేలా ఉన్నానని చెప్పినట్టు తెలుస్తుంది.
వెంటనే ఆయన కాలనీ సంఘం ప్రతినిధులకు సమాచారం ఇచ్చి వారి ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చి కల్పనను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కల్పన ఇంటి తలుపులు బ్రేక్ చేసి లోపలికి వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో మంచం మీద కల్పన పడి ఉన్నారు.
కల్పన భర్తను విచారించిన పోలీసులు
వెంటనే సమీపంలో ఉన్న హోలీ స్టిక్ ఆసుపత్రికి పోలీసులు ఆమెను తరలించారు అప్పటికి కల్పన పరిస్థితి విషమంగా ఉండడంతో క్రిటికల్ కేర్ యూనిట్లో ఉంచి వెంటిలేటర్ పై ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉంటే నిన్న రాత్రి చెన్నై నుంచి ఆస్పత్రికి వచ్చిన కల్పన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. అనంతరం కల్పన ఉంటున్న ఇంటికి తీసుకువెళ్లారు.
నిద్రమాత్రలు ఎక్కువ తీసుకున్న కల్పన.. అపస్మారక స్థితిలోకి
కల్పన మానసిక ఒత్తిడి కారణంగా గత కొంతకాలంగా నిద్రమాత్రలు తీసుకుంటున్నట్టు గుర్తించిన పోలీసులు ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల నిద్ర మాత్రలు అధిక మోతాదులో తీసుకున్నట్టుగా అనుమానిస్తున్నారు. ఎంతో బలమైన వ్యక్తిత్వం ఉన్న మహిళగా ఉన్న కల్పన ఆత్మహత్యకు పాల్పడే అవకాశం లేదని, ఒకవేళ అలా చేశారంటే దానికి బలమైన కారణమే ఉండి ఉంటుందని కల్పన సన్నిహితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications