వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్లాన్: నయీం ఇంట్లో రూ.2 కోట్ల విలువ చేసే చీరలు, సబ్ రిజిస్ట్రార్ల అరెస్టు?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని పుప్పాలగూడలో గల నయీం ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. పోలీసుల సోదాలో రూ.2 కోట్ల విలువైన చీరలు స్వాధీనం చేసుకున్నారు. వినాయకచవితి నాడు మహిళలకు పంచడానికి చీరలు సిద్ధంగా ఉంచినట్లు సమాచారం. నయీం డ్రైవర్, భార్య, అత్త, తల్లి నుంచి పోలీసులు కీలక సమాచారం సేకరిస్తున్నారు. కీలక నిందితులు శేషన్న కోసం పోలీసులు గాలిస్తున్నారు.

SIT to explore Nayeem's links with the help of call data

ప్రజల సానుభూతి సంపాదించుకుని ప్రజా జీవితంలోకి వచ్చి భువనగిరి నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేయాలనే ఎత్తుగడలో భాగంగానే ఈ చీరల పంపిణీకి నయీం ఏర్పాట్లు చేసుకున్నట్లు భావిస్తున్నారు. మీడియా ప్రతినిధులతో మాత్రం నయీం చాలా మెత్తగా మాట్లాడేవాడని అంటున్నారు. తనకు సంబంధించిన కవరేజీ మీడియాలో వ్యతిరేకంగా రాకుండా ఈ విధంగా వ్యవహరించేవాడని అంటున్నారు.

ఇదిలావుంటే, గ్యాంగ్‌స్టర్‌ నయీం అక్రమ భూ దందాలకు సహకరించిన సబ్‌ రిజిస్ట్రా‌ర్ల కు ఉచ్చు బిగుసుకుంటున్నట్లు మీడియాలో సోమవారం వార్తలు వచ్చాయి. భూ యజమానులను బెదిరించి, బలవంతగా రిజిస్ట్రేషన్లు చేయించుకోవడంలో నయీముద్దీన్‌కు సబ్‌ రిజిస్ట్రార్లు సహకరించినట్లు, ప్రతిఫలంగా వారికి గ్యాంగ్‌స్టర్‌ భారీ నజరానాలు ముట్టజెప్పినట్లు సిట్‌ అధికారులు గుర్తించారు.

నల్లగొండ జిల్లా భువనగిరిలో పనిచేసిన ఐదుగురు సబ్‌ రిజిసా్ట్రర్లు నయీంకు సహకరించినట్టు సిట్‌కు ఆధారాలు దొరికాయి. భువనగిరిలో దీర్ఘకాలం పనిచేసిన ఓ సబ్‌ రిజిస్ట్రార్‌తో పాటు ఓ మహిళా అధికారి, భువనగిరిలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేసి, ప్ర స్తుతం సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి, బీబీనగర్‌, మో త్కూర్‌లో పనిచేసిన అధికారులు నయీం అక్రమ రిజిస్ట్రేషన్లకు సహకరించినట్లు తేలింది.

నయీం కుటుంబసభ్యులు, ముఖ్య అనుచరుల పేరిట జరిగిన ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధిత వ్యక్తులు ఏనాడూ కార్యాలయానికి వచ్చేవారు కాదని, వేలి ముద్రల నమోదు రిజిస్టర్‌, తదితర స్టాంపులను కార్యాలయాల సిబ్బంది నయీం డెన్‌కే పంపేవారని తేలింది. నయీం కుటుంబ సభ్యులు, అనుచరుల పేర్లపై అడ్రస్‌ ప్రూఫ్‌లు లేకుండానే రిజిస్ట్రేషన్లు చేసినట్లు బయటపడింది. డాక్యుమెంట్లలో కొనుగోలుదారుల చిరునామాలు కూడా తప్పుగా నమోదు చేశారు.

English summary
It is said that about Rs 2 crore value sarees have been found in Nayeem's Puppalaguda residence by SIT.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X