‘పోకిరి’తోనే వచ్చారా?: సిట్ వరుస ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి, ఆ ప్రశ్నలివే!
డ్రగ్స్ కేసులో ఐటెం సాంగ్ గర్ల ముమైత్ ఖాన్‌పై ఎక్సైజ్ శాఖ సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ఐటెం సాంగ్ గర్ల ముమైత్ ఖాన్‌పై ఎక్సైజ్ శాఖ సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ కేసులో నోటీసులందుకున్న ముమైత్ ఖాన్ గురువారం ఉదయం 10గంటలకే సిట్ కార్యాలయానికి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉ. 10గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు అంటే సుమారు 6.30గంటలపాటు ఆమెను సిట్ మహిళా అధికారులు విచారించారు. సిట్ అధికారులు వరుస ప్రశ్నలతో ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసినట్లు సమాచారం.

అమ్మారా? తీసుకున్నారా?
‘మీరు డ్రగ్స్ అమ్ముతారా? తీసుకుంటారా?' అని ముమైత్‌ను ప్రశ్నించారు. పూరీ జగన్నాథ్, చార్మితో ఎప్పట్నుంచి పరిచయం అని అని అడిగారు. పోకిరీ సినిమాతోనే పూరీతో పరిచయం ఏర్పడిందా? అని ప్రశ్నించారు. తెలుగు ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేవారని ముమైత్‌ను ఆరా తీశారు.
Recommended Video


హైదరాబాద్-ముంబై ఎందుకు?
హైదరాబాద్ విడిచి ముంబై ఎందుకు వెళ్లారు? అని అధికారులు ప్రశ్నించారు.
హైదరాబాద్‌కు షూటింగ్‌ల కోసమే వచ్చేవారా? ఏయే సందర్భాల్లో వచ్చేవారని ముమైత్‌ను ప్రశ్నించారు. పబ్బులకు వెళ్లే అలవాటుందా? అని ప్రశ్నించారు. వారాంతాలు ఎక్కడ గడుపుతారని ఆరా తీశారు.

విదేశాలకు, పబ్బులకు ఎన్నిసార్లు? ఎందుకు?
ఎక్కువగా ఐటెం సాంగ్స్‌లో నటించే మీరు.. చిత్ర యూనిట్‌తో విదేశాలకు ఎందుకు? వెళ్లారని ప్రశ్నించారు. గోవా ఫెస్టివల్స్‌లో ఏం తీసుకునేవారు అని ప్రశ్నించారు. తరుణ్, నవదీప్ లకు చెందిన పబ్బులకు ఎన్నిసార్లు వెళ్లారు? అక్కడ డ్రగ్స్ ఏమైనా తీసుకున్నారా? అలాంటి కార్యకలాపాలు అక్కడేమైనా జరిగాయా? అని ప్రశ్నించారు.

కెల్విన్‌ను మీరు పరిచయం చేశారా?
డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కెల్విన్‌తో పరిచయం ఎలా ఏర్పడిందని సిట్ అధికారులు ముమైత్ ను ప్రశ్నించారు. సినిమా ఫంక్షన్లలో కూడా కలిశారా? అంటూ ఆరా తీశారు. ఆమె వ్యక్తిగత విషయాలను కూడా అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. కెల్విన్‌ను తెలుగు సినిమా ఇండస్ట్రీకి మీరే పరిచయం చేశారా? లేక ఎవరు? అని ముమైత్ ను ప్రశ్నించినట్లు తెలిసింది. నోటీసులందుకున్న వారికే కాకుండా కెల్విన్ ఇండస్ట్రీలోని ఇతరులకు కూడా పరిచయమేనా? అని ప్రశ్నించారు.

ముమైత్ స్పష్టమైన సమాధానాలు..
కాగా, సిట్ అధికారుల ప్రశ్నలకు ముమైత్ స్పష్టమైన సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ముమైత్ ఇచ్చిన సమాచారమే సిట్ దర్యాప్తులో కీలకం కానుంది. ఆమె ఇచ్చిన సమాచారంతో సిట్ దర్యాప్తు మరింత వేగంగా జరగనుంది. మరికొంత మందికి నోటీసులు ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ముమైత్ అంగీకరిస్తే ఆమె బ్లండ్ శాంపిల్స్ కూడా తీసుకునే అవకాశం ఉంది.
-
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
"నేను ఎంతమందితో తిరిగినా అది నీ ప్రాబ్లెమ్ కాదు" -
నా భర్తకు ఇవి ఉంటే చాలు: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
కెమెరా ముందే వాంతులు చేసుకున్న చిన్నారి పెళ్లికూతురు.. అసలేమైంది! వీడియో -
గద్దర్ అవార్డుల్లో గీతా ఆర్ట్స్ హవా.. ఆయన మంత్రాంగం పనిచేసిందా? -
వీడియో వైరల్: స్నేహా రెడ్డికి ఖరీదైన బహుమతి ఇచ్చిన అల్లు అర్జున్.. -
ట్రైలర్ కే థియేటర్లు తగలబడుతున్నాయి.. ఇక సినిమా రిలీజ్ అయితే..!! -
లాగిపెట్టి కొట్టిన అపరిచితుడు.. నడిరోడ్డుపై ఏడుస్తూ హీరోయిన్ గోడు! వీడియో -
కోకాపేట్ అల్లు సినిమాస్ లాంచ్ తేదీ అనౌన్స్: ఆ సినిమాలతో బోణీ -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications