SLBC టన్నెల్ ప్రమాదం... మరో మృతదేహం ఆనవాళ్ళు!

నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమల పెంట గ్రామ సమీపంలోని ఎస్ఎల్బీసీ టెన్నెల్లో ఫిబ్రవరి 22న జరిగిన 14 కిలోమీటర్ వద్ద చోటుచేసుకున్న ప్రమాద ఘటనలో ఎనిమిది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్ లో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సహాయక చర్యలలో మంచి పురోగతి కనిపిస్తుంది. సహాయక చర్యల్లో 32వ రోజున మరో మృతదేహం లభించింది.

నిరంతరాయంగా పని చేస్తున్న రెస్క్యూ బృందాలు
మినీ హిటాచితో మట్టి ఇతర శఖలాలు తొలగిస్తున్న క్రమంలో కన్వేయర్‌ బెల్ట్‌కు సుమారు 50 మీటర్ల దూరంలో మృతదేహం కనిపించినట్లు తెలుస్తుంది. 32వ రోజున టన్నెల్ లో మరో మృతదేహాన్ని గుర్తించారు. ఎస్ ఎల్ బి సి టన్నెల్ లో గల్లంతైన ఎనిమిది మందిని బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్న ఎన్డీఆర్ఎఫ్ ఎస్ డి ఆర్ ఎఫ్ సింగరేణి హైడ్రా బృందాలు వీరి మృతదేహాలను వెలికి తీయడానికి నిరంతరాయంగా పనిచేస్తున్నాయి.

SLBC Tunnel accident Another deadbody found in tunnel

మరో మృతదేహం ఆనవాళ్ళు
ఇక తాజాగా మరొక మృతదేహం ఆనవాళ్లను గుర్తించారు. ఒక కాలు కనిపించడం, దుర్వాసన రావడంతో అక్కడ తవ్వకాలు చేపట్టిన వారు ఈరోజు మధ్యాహ్నం మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చే అవకాశం ఉంది. టన్నెల్ పైకప్పు కూలి పడిన ఘటనలో 8 మంది సజీవంగా సమాధి అయిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ ఘటనలో రెండు మృతదేహాలను గుర్తించగా మరో ఆరుగురు మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది.

టన్నెల్ లోపల డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానం
టన్నెల్ లోపల డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సహాయక చర్యలలో 700 మంది నిర్విరామంగా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం లభించిన మృతదేహం ఎవరిది అనేది నిర్ధారించవలసి ఉంది. అనుమానిత ప్రాంతాలైన డి1, డి2 కాకుండా మరోచోట తవ్వకాలు జరుపుతుండగా ఈ మృతదేహం ఆనవాళ్లు లభించినట్టు సమాచారం.

మరో ఆరుగురి కోసం సొరంగంలో తవ్వకాలు
ఆ మృతదేహాన్ని రెస్క్యూ బృందాలు వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మొత్తంగా గడచిన 32 రోజులుగా జరుగుతున్న సహాయక చర్యల్లో సుమారు 700 మంది ఆపరేషన్ నిర్వహిస్తూ వారికోసం కొనసాగిస్తున్న అన్వేషణ ఇప్పటివరకు రెండు మృతదేహాలు లభ్యంకాగా మరో ఆరుగురి కోసం సొరంగంలో తవ్వకాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ విషయంపై ఆ మృతదేహం ఎవరిది అనేది గుర్తించి అధికారులు నిర్ధారిస్తూ ప్రకటన చేయాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+