అరెస్ట్‌తో సహా నిలుపుదల: స్మితా సబర్వాల్ కేసులో ఔట్‌లుక్‌కు ఊరట
హైదరాబాద్: తన ప్రతిష్టను దెబ్బతీసేలా కథనం ప్రచురించారంటూ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఇచ్చిన ఫిర్యాదు ఆదారంగా తమ పైన సిసిఎస్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని ఔట్‌లుక్ పత్రిక ప్రతినిధులు దాఖలు చేసిన పిటిషన్ పైన హైకోర్టులో బుధవారం వాదనలు ముగిశాయి.
దీని పైన విచారణ జరిపిన ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివశంకర రావు తీర్పును వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యాజ్యంలో తీర్పు వెల్లడించే వరకు పిటిషనర్ల అరెస్టుతో పాటు తదుపరి చర్యలను నిలిపుదల చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
ఔట్ లుక్ పత్రిక గ్రూపు అధ్యక్షుడు ఇంద్రనీల్ రాయ్, ఎడిటర్ ఇన్ చీఫ్ కృష్ణప్రసాద్, అసిస్టెంట్ ఎడిటర్ మాధవి తాత, కార్టూనిస్టు సాహిల్ అరెస్టుతో పాటు మరే ఇతర చర్యలు తీసుకోకుండా అన్ని ప్రొసీడింగ్స్‌పై స్టే మంజూరు చేస్తూ హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

స్మితా సబర్వాల్ ప్రతిష్టను దిగజార్చేలా కథనం, కార్టూన్ ప్రచురించారంటూ ఆమె భర్త, ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ ఈ ఏడాది జూలై 5న సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఈ క్రిమినల్ కేసును కొట్టివేయాలని ఔట్ లుక్ మ్యాగజైన్ సంపాదకవర్గం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు జడ్జి జస్టిస్ బి శివకుమార్ ఆదేశాలను రిజర్వు చేస్తూ స్టే మంజూరు చేశారు. తదుపరి తీర్పు వెలువడే వరకు మేగజైన్ ప్రతినిధులకు ఊరట
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications