డీజీపీ ఆఫీసులో 3 రోజులుగా పాము కలకలం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డీజీపీ) కార్యాలయంలో బుధవారం పాము హల్ చల్ చేసింది. ప్రస్తుతం పోలీసు నియామక మండలి కార్యాలయం ఉన్న పాత భవనానికి వెళ్లే దారిలో మెట్టుకు ఉన్న చిన్న రంధ్రంలో మూడు రోజుల క్రితం పాము కనిపించింది.
గత మూడు రోజుల నుంచి పాము డీజీపీ కార్యాలయం ప్రాంగణంలో సంచరిస్తూ ముప్పతిప్పలు పెడుతోంది. సిబ్బంది అప్రమత్తతో పాము మూడు రోజుల కిందట పాత డీజీ కార్యాలయం గోడకు ఉన్న చిన్న రంధ్రంలోకి వెళ్లింది.

దీంతో కార్యాలయం పరిపాలన విభాగం అధికారులు పాములు పట్టే వారికి సమాచారం అందించారు. అప్పటి నుంచి ఆ రంధ్రం నుంచి పామును బయటకు రప్పించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. బుధవారం కూడా పామును పట్టేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది.
అయితే, బుధవారం ఆ పామును పట్టుకోవడంతో ఎట్టకేలకు అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆ పాము జెర్రిపోతు. ఇది ఓ రకం పాము. దీనిని పట్టింది చికలకగూడ పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న వెంకటేశ్వర నాయక్ అని తెలుస్తోంది. పాము దూరిన రంధ్రంలోకి పైపుల ద్వారా నీటిని పంపడంతో పాము బయటకు వచ్చింది. దీంతో దానిని పట్టుకున్నారు.












Click it and Unblock the Notifications