హైదరాబాద్ లో 'స్నో వరల్డ్'.. మంచులో ఫుల్ ఎంజాయ్.. తక్కువ ధరకే..!

మనదేశంలో సాధారణంగా హిమాలయాల్లో మంచు కొండలు ఉంటాయి. మంచుకొండల్లో విహరించేందుకు హిమాలయ పర్వతాలకు వెళ్తుంటారు. జమ్మూ కాశ్మీర్.. టూరిస్టులకు ప్రధాన పర్యటక ప్రదేశంగా ఉంటుంది. ఇక్కడి మంచు పర్వతాల్లో ఎంజాయ్ చేసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దక్షిణాది నుంచి అనేకమంది తరలివెళ్తుంటారు. ముఖ్యంగా వేసవి సెలవుల్లో కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లోని పలు పర్యాటక ప్రాంతాలకు టూరిస్టులు వెళ్తుంటారు. మరి హైదరాబాద్ లో కాశ్మీర్ అందాలను తనివితీరా ఆస్వాదించేలా ఓ పార్కు ఇప్పుడు ఆకర్షిస్తోందని మీకు తెలుసా..?

మంచులో ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారా..? అయితే మీరు కాశ్మీర్ వరకు వెళ్లాల్సిన పనిలేదు. హైదరాబాద్ లోనే ఇప్పుడు మంచులో ఫుల్ ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. అదే 'స్నో వరల్డ్' .. హైదరాబాద్ అనగానే చాలామందికి టెక్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, రెస్టారెంట్స్, నైట్ లైఫ్, అడ్వెంచర్ యాక్టివిటీస్ మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ ఇప్పుడు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఈ స్నో వరల్డ్ లో మీరు మంచు జలపాతం, మంచులో ఆటలు ఆడుకోవచ్చు.

ఈ ఇండోర్ స్నో థీమ్ పార్క్ లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉంది. దాదాపు 2 ఎకరాల్లో ఈ పార్కు విస్తరించి ఉంది. ఇక్కడి స్నో పార్కులో మైనస్ 5 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కూడా మంచులో ఎంజాయ్ చేయొచ్చు. పర్యటకులు ఆర్టిఫిషియల్ స్నో ఫాల్, ఐస్ స్కేటింగ్, వింటర్ థీమ్ రైడ్స్ ను చేసే అవకాశం ఇక్కడ ఉంది. ఈ స్నో వరల్డ్ టైమింగ్స్ చూస్తే ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది.

ఒక్కో సెషన్ ఒక గంట పాటు ఉంటుంది. జాకెట్స్, బూట్స్, గ్లోవ్స్ ధరించి ఈ పార్కులో ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. ఇక్కడి మంచులో టోబోగన్ రైడ్స్, స్నో ట్యూబ్స్, స్లీగ్ స్లైడ్స్, బంపర్ కార్లు ఐస్ పై చేసే వీలుంది. అలాగే ఐస్ స్కేటింగ్, స్నో డ్యాన్సింగ్, స్నో మెన్ ను బిల్డ్ చేసుకోవడం చేయాలి. ఇక సాధారణంగా ఈ ప్రాంతానికి మొబైల్ ఫోన్ లు, కెమెరాలు తీసుకెళ్లడం నిషేధం. అలాగే లాకర్స్ రూ. 10 నుంచి రూ. 50 వరకు అందుబాటులో ఉన్నాయి.

SnowWorld Hyderabad s No1 Snow Theme Park Attracting Crowds with Fun Snow Activities Hyderabad Snow

ఇక స్నో వరల్డ్ టికెట్ ధరలు రేంజ్ రూ. 500 నుంచి రూ. 800 వరకు ఉంటుంది. అడల్ట్ టికెట్ ధరలు రూ. 600 నుంచి రూ. 750 వరకు ఉంటుంది. అలాగే రెండేళ్లు దాటిన పిల్లలకు టికెట్ ధరలు రూ. 450 నుంచి రూ. 650 వరకు ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+